Hari Hara Veera Mallu Review: పూనకాలు వచ్చేశాయ్‌ భయ్యా.. హరిహర వీరమల్లు పబ్లిక్ టాక్

పవన్‌ కళ్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. నిన్న రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్లు ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ వస్తోంది. సినిమా కథ బాగుందని చెబుతున్నారు.

New Update
Hari Hara Veeramallu

Hari Hara Veera MalluReview

Hari Hara Veera Mallu Review:

పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. నిన్న రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్లు ప్రీమియర్ షోలు(Hari HaraVeera Mallu Premiers) పడ్డాయి. ఈరోజు బెన్‌ఫిట్‌ షోలకు పవన్‌ ఫ్యాన్స్‌ పెద్దఎత్తున తరలివచ్చారు. ఓవర్సీస్‌లో కూడా ప్రీమియర్స్‌ ప్రదర్శించారు. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ వస్తోంది. సినిమా కథ బాగుందని చెబుతున్నారు. అలాగే పవన్ యాక్షన్, ఎలివేషన్‌ సీన్లు ఆకట్టుకున్నాయని అంటున్నారు. గ్రాఫిక్స్‌ కూడా అదిరిపోయినట్లు చెబుతున్నారు. 

చారిత్రక కథను డైరెక్టర్లిద్దరూ బాగా చూపించారని అంటున్నారు. సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదని.. కీరవాణి మ్యూజిక్‌ కూడా ఈ చిత్రానికి హైలెట్‌ అని చెబుతున్నారు. ఈ పార్ట్‌1లో ప్రతీ క్యారెక్టర్‌ని మొదటి నుంచి ఎండింగ్‌ వరకు చాలా బాగా డిజైన్ చేసుకొని చూపెట్టారని.. పార్ట్‌ 2లో ఈ పాత్రలకు ప్రతీదానికి వివరణ ఉంటుందని అంటున్నారు.  

చాలామంది అభిమానులు క్లైమాక్స్‌ బాగుందని చెబుతున్నారు(Hari Hara Veera Mallu Review). ఔరంగజేబు, పవన్‌ కళ్యాణ్ మధ్య సీన్లు ఆకట్టుకున్నాయని అంటున్నారు. కోహినూర్‌ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా సినిమా కనెక్ట్‌ అవుతుందని చెబుతున్నారు. ఇంకొందరు ఫస్ట్‌ ఆప్‌ బాగుందని.. సెకండ్‌ ఆఫ్‌ యావ్‌రేజ్‌గా ఉందని చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పవన్‌ ఫ్యాన్స్‌ ఈ సినిమాకు భారీగా తరలివచ్చారు. కర్ణాటకలోని ఓ థియేటర్‌ వద్ద ఆహారం కూడా అందించారు. 

Also Read: అసలెక్కడా లేని దేశం...దానికో రాయబార కార్యాలయం..ఘజియాబాద్ లో హైటెక్ మోసం

Also Read: రష్యా మహిళను బహిష్కరించొద్దు : కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

Advertisment
తాజా కథనాలు