/rtv/media/media_files/2025/07/22/hari-hara-veera-mallu-ticket-bookings-open-2025-07-22-17-34-54.jpg)
Hari Hara Veera Mallu Ticket Bookings Open
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘‘హరి హర వీరమల్లు’’ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్‌కు ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే ఇవాళ (జులై 22న) హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో ‘హరి హర వీరమల్లు’ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
బుక్‌మైషోలో మాత్రమే కాకుండా డిస్ట్రిక్ట్ యాప్, బ్రో యాప్ వంటివి వేదికలలో టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 23న రాత్రి 9 గంటలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో ప్రీమియర్ షోలు వేయనున్నారు. దీనికోసం బుకింగ్స్ ఇలా ఓపెన్ అయ్యాయో లేదో అలా సోల్డ్ అవుట్ చూపిస్తుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ‘‘హరి హర వీరమల్లు’’ చిత్రానికి టికెట్ ధరలను పెంచుతూ ప్రత్యేక అనుమతులు మంజూరు చేశాయి.
ఆంధ్రప్రదేశ్
ఏపీలో జూలై 23న పెయిడ్ ప్రీమియర్ షోల కోసం ఒక్కో టికెట్ ధరను రూ.600 వరకు నిర్ణయించారు. ఎంపిక చేసిన సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో ప్రీమియర్ షోను ప్రదర్శించనున్నారు. రెక్లయినర్/సోఫా సదుపాయం కలిగిన టికెట్ ధర దాదాపు రూ.1000 దాటింది. అలాగే బాల్కనీ ధర రూ.830 దాటగా.. సెకండ్ క్లాస్ రూ.790 (బుకింగ్ ఛార్జీలు అదనం)గా ఉన్నాయి.
Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా
ఇక జులై 24 నుంచి మల్టీప్లెక్స్‌లలో పెంచిన ధరల ప్రకారం.. రాయల్ సీటింగ్‌లో రూ.495, ఎగ్జిక్యూటివ్ సీటింగ్‌లో రూ.377 ధర కనిపిస్తోంది. అదే సమయంలో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో బాల్కనీ రూ.250 కాగా.. ఫస్ట్ క్లాస్ రూ.150గా నిర్ణయించారు.
తెలంగాణ:
తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. అయితే తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్‌కు సంబంధించి ఇంకా బుకింగ్స్ ప్రారంభం కాలేదు. జూలై 24 నుంచి మల్టీప్లెక్స్‌లలో రాయల్ సీటింగ్ కోసం రూ.500గా నిర్ణయించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కోసం రూ.413 (బుకింగ్ ఛార్జీలు అదనం)గా ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్‌మై షోలో చూపిస్తోంది. అదే సమయంలో సింగిల్ స్క్రీన్‌లో బాల్కనీ రూ.300 కాగా, ఫ్రంట్ సర్కిల్‌లో రూ.200గా నిర్ణయించారు.
Pawan Kalyan | Hari Hara Veera Mallu | hari hara veera mallu tickets open