/rtv/media/media_files/2025/07/23/pawan-kalyan-2025-07-23-20-34-30.jpg)
Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ అభిమానులను ఉద్దేశించి ఉత్సాహపూరితమైన, మాస్ స్పీచ్ ఇచ్చారు.
Also Read : మా పవన్ అన్న సినిమా.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
Pawan Kalyan mass speech
పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు, తన అభిమానుల పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘‘మీ ప్రేమ, అభిమానమే నాకు శ్రీరామరక్ష’’ అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం పడిన కష్టాన్ని, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి విజన్ను ప్రశంసించారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా కేవలం ఒక కమర్షియల్ చిత్రం మాత్రమే కాదని, ఇందులో ఒక సందేశం ఉందని తెలిపారు. చరిత్రలోని ఒక స్ఫూర్తిదాయకమైన కథను ఈ సినిమా ద్వారా చెప్పడానికి ప్రయత్నించామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
తన పాత్ర వీరమల్లు సామాన్య ప్రజల కోసం, ధర్మం కోసం పోరాడే యోధుడని మరోసారి స్పష్టం చేశారు. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కల్యాణ్ పాల్గొన్న ఈ మొదటి పబ్లిక్ సినిమా ఈవెంట్ కావడంతో, దీనికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. పవన్ ప్రసంగంతో అభిమానుల్లో జోష్ మరింత పెరిగింది. సినిమా భారీ విజయం సాధించి, కొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ హుషారెత్తించే సాంగ్స్ పాడటం విశేషం.