/rtv/media/media_files/2025/07/23/hari-hara-veera-mallu-super-hit-became-this-is-main-reasons-2025-07-23-19-08-17.jpg)
Hari Hara Veera Mallu
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (hari hara veera mallu) చిత్రం ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సంపాదించింది. కానీ సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో రెండో రోజుకు కలెక్షన్లు పడిపోయాయి. ఇందులో పవన్ కల్యాణ్ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇది కూడా చూడండి: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
Hari Hara VeeraMallu
అయితే ఇప్పటి వరకు ఈ మూవీ టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో చాలా మంది సినిమాను చూడలేకపోతున్నారు. అలాంటి వారికోసం చిత్రబృందం అదిరిపోయే సర్ ప్రైజ్ అందించింది. జూలై 28వ తేదీ (ఇవాళ్టి నుంచి) నుంచి ‘హరి హర వీరమల్లు’ టికెట్లు సాధారణ ధరలకే లభించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే బుక్ మై షో, డిస్ట్రిక్ యాప్‌లలో ఈ మూవీ టికెట్ రేట్లకు సంబంధించిన మార్పులు జరుగుతున్నట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: పెళ్లికి ముందు HIV టెస్టు తప్పనిసరి.. మంత్రి సంచలన ప్రకటన
ఇవాళ నుంచి ఎలాంటి టికెట్ ధరల పెంపు లేకుండా కేవలం సాధారణ ధరకే టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. సింగిల్ స్క్రీన్‌లలో బాల్కనీ రూ.175 కాగా.. మల్టీపెక్స్‌లలో రూ.295కే ‘హరిహర వీరమల్లు’ టికెట్లు లభిస్తున్నాయి. అందువల్ల ఇప్పటికి ఇంకా ఈ సినిమా చూడని వారికి ఇదొక మంచి అవకాశం అనే చెప్పాలి.
ఇది కూడా చూడండి: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
ఇది కూడా చూడండి: సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం