Gautham Menon: సూర్య నన్ను బాధపెట్టాడు: డైరెక్టర్ గౌతమ్ మీనన్ సంచలన కామెంట్స్!

డైరెక్టర్ గౌతమ్ మీనన్ తాను ఏడేళ్ల క్రితం తెరకెక్కించిన 'ధృవ నక్షత్రం' గురించి పలు విషయాలను పంచుకున్నారు. ధృవ నక్షత్రం కథను విక్రమ్ కంటే ముందు వేరే హీరోలకు చెప్పగా ..కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేశారట. కానీ ఆకథకు సూర్య నో చెప్పడం తట్టుకోలేకపోయినట్లు తెలిపారు.

New Update
Goutham Menon

Goutham Menon

Goutham Menon:  చియాన్ విక్రమ్ హీరోగా డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన చిత్రం 'ధ్రువ నక్షత్రం'. దాదాపు ఏడేళ్ల క్రితమే పూర్తయిన ఈ సినిమా పలు కారణాల చేత వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు 2025 ఫిబ్రవరి 29న విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మేనన్‌ ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. 

Also Read:NTR Death Anniversary: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తారక్, కల్యాణ్‌ రామ్‌ నివాళి.. అక్కడ ఎన్టీఆర్ ఏం చేశారో చూడండి!

సూర్య మాటలు బాధించాయి.. 

గౌతమ్ మేనన్‌ మాట్లాడుతూ..  ధృవ నక్షత్రం కథను విక్రమ్ కంటే ముందు  వేరే హీరోలకు చెప్పాను. కానీ కొన్ని కారణాల చేత వారు దీనిని రిజెక్ట్ చేశారు. అందుకు నేనేమీ బాధపడలేదు. కానీ ఈ కథకు హీరో సూర్య నో చెప్పడాన్ని తట్టుకోలేపోయినట్లు తెలిపారు. అది తన్నెంతో బాధించిందని చెప్పారు. ఎన్నో ఏళ్ళ క్రితం  తెరకెక్కించినప్పటికీ  ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు ఏ మాత్రం బోర్ ఫీల్ అవ్వరని. నేటి తరం ప్రేక్షకులకు ఈ కథ తప్పకుండా నచ్చుతుందని తెలిపారు. ఇటీవలే 12 ఏళ్ళ తర్వాత విడుదలైన  'మద గజ రాజ' మంచి సక్సెస్ అందుకుంది. అదే మాదిరిగా మా సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు.

Also Read: Viduthalai 2: ఓటీటీలోకి వచ్చేసిన 'విడుదల పార్ట్‌-2'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఒండ్రాగా ఎంటర్‌టైన్‌మెంట్‌, ఒరుఊరిలోరు ఫిల్మ్ హౌస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, రీతూ వర్మ, రాధాకృష్ణన్ పార్థిబన్, ఆర్ రాదికా శరత్‌కుమార్, సిమ్రాన్, వినాయకన్, దివ్య దర్శిని, మున్నా సైమన్, వంశీ కృష్ణ, సలీం బేగ్, సతీష్ కృష్ణన్, మాయ ఎస్ కృష్ణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గౌతమ్ మేనన్ తెలుగులో ఏం మాయ చేశావ్, ఘర్షణ, ఏటో వెళ్ళిపోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇందులో  'ఏం మాయ చేశావ్' క్లాసిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల  హృదయాల్లో నిలిచిపోయింది. 

Also Read:  Parenting Tips: తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే.. పిల్లలను ఆరోగ్యం కాపాడుకోవడం కష్టం!

Advertisment
తాజా కథనాలు