/rtv/media/media_files/Sq434ddM3xjpywe3UxQ4.jpeg)
ఆహారపు అలవాట్లు..
చాలా మంది పేరెంట్స్ పిల్లలు ఏడుస్తున్నారని, మారాం చేస్తున్నారని జంక్ ఫుడ్ అలవాటు చేస్తారు. ఇది పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనికి తోడు పిల్లల శారీరక శ్రమపై కూడా పెద్దగా శ్రద్ధ చూపరు. మంచి ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల, పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి రెండూ మందగిస్తాయి.
/rtv/media/media_files/2025/01/18/parenting-tipss.jpeg)
అధిక స్క్రీన్ టైం
నేటి డిజిటల్ యుగంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి. తల్లిదండ్రులు తమ పనుల్లో బిజీగా ఉండడంతో పిల్లలను ఎంగేజ్ చేయడానికి వారికి ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అందిస్తారు.
/rtv/media/media_files/2024/11/23/watchingmobile11.jpeg)
అయితే అధిక స్క్రీన్ సమయం పిల్లల ఏకాగ్రత సామర్థ్యాన్ని, సామాజిక నైపుణ్యాలను ప్రభావితం చేస్తుంది.
/rtv/media/media_files/2024/11/23/watchingmobile81.jpeg)
ఇంటి వాతావరణం
ఇంటి వాతావరణం పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎల్లప్పుడూ ఇంట్లో గొడవలు, వాదనలు మధ్య పెరిగిన పిల్లలు మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. అలాగే ఇతర వ్యక్తులతో కలిసిపోవడానికి వారికి చాలా కష్టంగా ఉంటుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/unhappy-couple-quarreling-at-home-divorce-concept-2022-11-17-15-46-05-utc-scaled.webp)
పిల్లల ఎమోషన్స్
నేటి బిజీ లైఫ్ స్టైల్ లో పిల్లల కోసం సమయం దొరకడం పేరెంట్స్ కి చాలా కష్టంగా మారుతోంది. పిల్లలు ఎంజాయ్ చేయడానికి బొమ్మలు, గ్యాడ్జెట్స్ ఇస్తే సరిపోతుందని భావిస్తారు.
/rtv/media/media_files/2025/01/18/childparenting.jpeg)
కానీ, అవి మాత్రం ఇస్తే సరిపోదు. వారితో ప్రతిరోజూ కొంత సమయం గడపాలి. వారి భావాలను అర్థం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు, పేరెంట్స్ మధ్య బాండింగ్ పెరుగుతుంది. అలాగే వారికి లోన్లీ ఫీలింగ్ ఉండదు.
/rtv/media/media_files/2025/01/18/9NfOBodnl0qhJ1hN2kt4.jpg)
చదువు ఒత్తిడి..
ఈ మధ్య కాలం చదువుల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే పిల్లల మానసిక ఆరోగ్యం సరిగా ఉండదు. ఇది వారి ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది. కేవలం చదువు మాత్రమే కాకుండా పిల్లలకు ఇంట్రెస్ట్ ఉన్న ఇతర అంశాల వైపు కూడా ప్రోత్సహించాలి.
/rtv/media/media_files/2025/01/18/child-with-parent.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.