Viduthalai 2 ott release
Viduthalai 2: కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'విడుతలై పార్ట్ 2'. తెలుగులో ఈ చిత్రం 'విడుదల' అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2023లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న 'విడుదల' కొనసాగింపుగా 'విడుతలై పార్ట్ 2' రూపొందింది. గతేడాది రిలీజైన ఈ చిత్రం పార్ట్ 1 స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది.
ఓటీటీలో 'విడుదల పార్ట్-2'
'విడుదల పార్ట్-2' నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తమిళ్, తెలుగు, భాషల్లో అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మంజు వారియర్, సూరి, భవానీ శ్రీ , గౌతమ్ వాసుదేవ్, రాజీవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
#Viduthalai Part 2 is set to stream on #PrimeVideo starting January 19. #VetriMaaran #VijaySethupathi #ViduthalaiPart2 #Viduthalai2 #OTTRelease #ViduthalaiPart2OnPrime #Viduthalai2OnPrime #OTT pic.twitter.com/skPHLtZnQI
— OTTRelease (@ott_release) January 18, 2025
Also Read: Manoj Vs Vishnu: నాన్నను పక్కన పెడదాం.. రా.. మనిద్దరం ఫేస్ 2 ఫేస్ చూసుకుందాం.. విష్ణుకు మనోజ్ సవాల్!