This Week Movies: లవ్, ఎమోషన్, డ్రామా.. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్

ప్రతీ వారంలానే ఈ వారం కూడా పలు సినిమాలు, సీరీస్ లు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. రామం రాఘ‌వం, బాపు, డ్రాగన్, డాకు మహారాజ్, జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

New Update
this week upcoming movies

this week upcoming movies

This Week Movies:  వాలెంటైన్స్ వీక్(Valentine's Week) సినిమాల సందడి ఇంకా కొనసాగుతుండగానే.. ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు, సీరీస్(Web Series) లు ఓటీటీ(OTT), థియేటర్ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేయబోయే సినిమాల లిస్ట్ ఇక్కడ చూద్దాం.. 

Also Read: దారిలో మొసళ్లు, పాములు.. అక్రమంగా అమెరికా ఇలా వెళ్లాను.. పంజాబ్ వ్యక్తి కన్నీటి కథ!

థియేటర్ సినిమాలు.. 

డ్రాగన్

లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. జార్జ్ మేరియన్, ఇందుమతి మణికందన్, K. S. రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, VJ సిద్ధు మరియు హర్షత్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

రామం రాఘ‌వం

నటుడు డైరెక్టర్  సముద్రఖని, జబర్దస్త్ ఫేమ్ ధనరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రామం రాఘ‌వం. ధనరాజ్ కీలక పాత్రలో నటిస్తూనే  ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 21 థియేటర్స్ లో విడుదల కానుంది. 

Also Read: మలైకా అరోరాకి ఇష్టమైన జ్యూస్‌ ఇదే.. అది ఎలా తయారు చేయాలో తెలుసా..

Also Read: విశాఖలో లారీ భీభత్సము.. పార్కులోకి దూసుకెళ్లడంతో..

బాపు 

బాపు: ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ అనే ఉపశీర్షికతో తెరకెక్కిన ఈ చిత్రం కూడా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, ఆమని, బలగం సుధాకర్ రెడ్డి,  అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దయా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

 'జాబిలమ్మ నీకు అంత కోపమా'  

హీరో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన  'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమా కూడా ఫిబ్రవరి 21న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇందులో అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 

ఓటీటీ సినిమాలు.. 

డాకు మహారాజ్: నెట్ ఫ్లిక్స్ (ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్)
మార్కో:  ఆహా (ఫిబ్రవరి 21 నుంచి)
జీరోడే : నెట్ ఫ్లిక్స్ (ఫిబ్రవరి 21 నుంచి)
క్రైమ్‌ బీట్‌ : జీ5 (ఫిబ్రవరి 21)

జియో హాట్‌స్టార్

  • ది వైట్‌ లోటస్‌:  ఫిబ్రవరి 17
  • ఊప్స్‌ అబ్‌ క్యా:  ఫిబ్రవరి 20
  • ఆఫీస్‌: ఫిబ్రవరి 21

Also Read: chhaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు