Venkatesh: నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న సూపర్ హాట్ టాక్ 'అన్‌స్టాపబుల్' విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం సీజన్ 4 రన్ అవుతోంది. ఈ టాక్ షోలో ఇప్పటికే పలువురు సెలెబ్రెటీలు సందడి చేయగా.. తాజాగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, అతని బ్రదర్ నిర్మాత సురేష్ బాబు గెస్టులుగా పాల్గొన్నారు. ఇందులో వెంకటేష్ ఫ్యామిలీ, సినిమా లైఫ్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే అన్న సురేష్ బాబు గురించి మాట్లాడుతూ.. నాన్న లేని లోటును అన్నయ్య తీరుస్తున్నాడు.. తండ్రి పాత్రను పోషిస్తున్నాడు. ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్ లా ఉన్నాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో సురేష్ బాబు కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఈ క్రమంలో వెంకటేష్, సురేష్ బాబు తండ్రి రామానాయుడిని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. Also Read: 2024లో ప్రపంచాన్ని వణికించిన భయంకరమైన వ్యాధులివే.. ఇందులో మీకు ఏదైనా సోకిందా? నాన్న రెండు కోరికలు తీరలేదు.. వెంకటేష్ ఎమోషనల్ తండ్రి రామానాయుడి తీరని కోరికల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. నాన్న చివరి రోజుల్లో సినిమా గురించే ఆలోచించేవారు. ఆరోగ్యం బాగాలేకపోయిన స్క్రిప్ట్ చదివేవారు. చివరిగా వెంకటేష్ ఒక సూపర్ హిట్ సినిమా చేయాలని బాగా కోరుకున్నారు. అందులో తాను కూడా నటించాలని ఆశపడ్డారు. కానీ అది సాధ్యం కాలేదు. చివరి కోరికగా ఒక సక్సెస్‌ఫుల్ సినిమా చేయలేకపోయామనే బాధ ఆయనకు అలాగే ఉండిపోయింది. అది తలుచుకున్న ప్రతిసారి మాకు ఎంతో వేదన కలుగుతుంది అంటూ సురేష్ బాబు, వెంకటేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాము సినిమాతో బిజీగా ఉన్నారు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరీ ప్రధాన పాత్రలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్ లో విడుదల కానుంది. Also Read: OTT: ఈ సినిమాలు చూస్తే వాష్‌రూమ్‌కు ఒంటరిగా వెళ్లలేరు.. ఓటీటీలో బెస్ట్ సైకో-థ్రిల్లర్ చిత్రాలు ఇవే!