BIG BREAKING: ఈడీ విచారణకు హాజరైన అల్లు అరవింద్

అల్లు అరవింద్‌కు బిగ్‌ షాక్ తగిలింది. అరవింద్‌ను ఈడీ అధికారులు దాదాపుగా 3 గంటల పాటు ప్రశ్నించారు. రామకృష్ణ బ్యాంకు స్కాం కేసులో భాగంగా అరవింద్‌ను ఈడీ అధికారులు విచారించారు. వచ్చే వారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు.

New Update
allu aravind about revanth reddy comments

allu aravind

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు షాక్ ఇచ్చారు. రామకృష్ణ బ్యాంకు స్కాం కేసు కు సంబంధించి అరవింద్‌ను ఈడీ అధికారులు దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు.ఈ కేసులో భాగంగా 2018-19 సంవత్సరాల మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఈడీ అధికారులు అల్లు అరవింద్‌ను వివరాలు అడిగారు. రామకృష్ణ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి అల్లు అరవింద్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఈ విచారణ చేశారు.

ఇది కూడా చూడండి:Shubman Gill: దూకుడు మీదున్న శుభమన్ గిల్.. డబుల్ సెంచరీతో రికార్డు

ఇది కూడా చూడండి:Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వరద బీభత్సం.. నీట మునిగిన ఆలయాలు

మరోసారి విచారణకు..

విచారణ అనంతరం అధికారులు అల్లు అరవింద్‌కు వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మరింత సమాచారం సేకరించడానికి ఈడీ అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు తదుపరి విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో వేచి చూడాలి.

ఇది కూడా చూడండి:Unwanted Hair: ముఖంపై అవాంచిత రోమాలా! లేజర్ చికిత్స సురక్షితమేనా?

ఇది కూడా చూడండి:Nayanthara-Vignesh: జానీ మాస్టర్ ఎఫెక్ట్.. నయనతార, విఘ్నేష్‌పై దుమ్మెత్తి పోస్తోన్న నెటిజన్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు