/rtv/media/media_files/2025/03/14/huUUcpmQrp1O2b2qUf0m.jpg)
Pradeep Ranganathan
Pradeep Ranganathan: తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్నేళ్లుగా నిర్మాతలు జెట్ స్పీడ్ లో సినిమాలను తీస్తున్నారు. మన తెలుగు నిర్మాతలతో పోలిస్తే మిగిలిన భాషల నిర్మాతలు కొంచెం వెనకపడి ఉన్నారని చెప్పాలి. ఇక్కడి రెమ్యూనరేషన్లకి టెంప్ట్ అయ్యి ఇతర భాషల హీరోలు కూడా తెలుగులో పని చేయడానికి ఇష్టపడుతున్నారు.
Also Read: పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!
ధనుష్, దుల్కర్, సూర్య ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టులో చాల పేరులే ఉన్నాయి. ఇప్పుడు వాటిలో మరో కొత్త పేరు చేయించి. ఆ పేరే ప్రదీప్ రంగనాధన్. ఇటీవల డ్రాగన్ మూవీతో తెలుగులో కూడా మంచి గుర్తింపు పొందిన తమిళ హీరో. ప్రదీప్ నటించిన ‘డ్రాగన్’, ‘లవ్ టు డే’ వంటి సినిమాలు తెలుగులో మంచి ఆదరణ పొందాయి.
Also Read: రంజాన్ ఎఫెక్ట్.. వాచిపోతున్న పండ్ల రేట్లు.. కిలో ఎంతంటే?
'మ్యాడ్' డైరెక్టర్ తో ప్రదీప్ రంగనాధన్..
ప్రస్తుతం, తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రదీప్ రంగనాధన్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్మెంట్ సంస్థ ఈ యంగ్ హీరోను తెలుగులో పరిచయం చేస్తూ సినిమా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు కళ్యాణ్, 'మ్యాడ్' సినిమాతో మంచి గుర్తింపు పొందారు కళ్యాణ్. ప్రస్తుతం 'మ్యాడ్ 2' చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్న కళ్యాణ్, ప్రదీప్ రంగనాధన్ కోసం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కథను రెడీ చేస్తున్నారట.
Also Read: ఒప్పందం పై పుతిన్ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్!
ముందుగా కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను రవితేజతో చేయాలనుకున్నాడు. కానీ, రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాను పూర్తి చేసి జనవరిలో సంక్రాంతి విడుదల టార్గెట్ గా మరో ప్రాజెక్ట్ ను మొదలు పెట్టనున్నారు. అందువల్ల, ఈ గ్యాప్ లో డైరెక్టర్ కళ్యాణ్, ప్రదీప్ రంగనాధన్ తో ఓ కొత్త తెలుగు సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యారు.
Also Read: ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..