'ఓజీ' స్పెషల్ సాంగ్.. పవన్ తో రాధికా స్టెప్పులు, ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్

పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీలో స్పెషల్ సాంగ్ కోసం 'డీజే టిల్లు' బ్యూటీ నేహా శెట్టిని తీసుకున్నారు. ఈ విషయాన్ని నేహా శెట్టి తన ఇన్ స్టా పోస్ట్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతుండగా..నేహా శెట్టి తాజాగా సెట్స్ లో అడుగుపెట్టింది. 

New Update
og (1)

టాలీవుడ్‌లో అతికొద్ది సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ముద్దుగుమ్మ నేహా శెట్టి. సిద్దు జొన్నలగడ్డతో నటించిన 'డీజే టిల్లు' మూవీ ఆమెకు మంచి స్టార్డమ్‌ అందించింది. ఈ సినిమాలో రాధికా రోల్ లో నేహా శెట్టి ఓ రేంజ్ లో గ్లామర్ షో చేయడంతో ఒక్కసారిగా యూత్ హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. 

రీసెంట్ గా కార్తికేయ, విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. సుజీత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా 'ఓజీ' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను ఇటీవల స్టార్ట్ చేసాడు సుజిత్. 

నేహా శెట్టి స్పెషల్ సాంగ్..

పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ను తీస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ ఉందట. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం డీజే టిల్లు లో మెరిసిన నేహా శెట్టిని తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నేహా శెట్టి తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతుండగా..నేహా శెట్టి తాజాగా సెట్స్ లో అడుగుపెట్టింది. 

ఇక ఈ విషయం తెలిసి పవన్ ఫ్యాన్స్  OGలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్ అవుతుందని, పవర్ స్టార్ తో రాధికా వేసే స్టెప్పులకు థియేటర్స్ షేక్ అవుతాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 'ఓజీ' మూవీ దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఇంకా పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే షూట్ బ్యాలెన్స్ ఉందని సమాచారం.

publive-image

Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు