Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..?

ప్రభాస్ 'రాజాసాబ్' మూవీ రిలీజ్ ఏప్రిల్ 10, 2025 అని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అదే డేట్ కి యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా 'జాక్' రిలీజ్కానున్నట్లు ప్రకటించారు.

New Update
prabhas (1)

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాడు గానీ, అవి అనుకున్న సమయానికి రిలీజ్ అవ్వడం లేదు. డార్లింగ్ గత సినిమాలు చూస్తే ఇది అర్థమవుతుంది. ఆదిపురుష్, సలార్, కల్కి సినిమాలు మొదట అనౌన్స్ చేసిన డేట్ కు కాకుండా పలు వాయిదాల తర్వాత థియేటర్స్ లో సందడి చేశాయి. 

ఇక ఇప్పుడు 'రాజా సాబ్' విషయంలోనూ అదే జరుగనున్నట్లు తెలుస్తోంది. మారుతితో ప్రభాస్ చేస్తున్న 'రాజా సాబ్' మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 10 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. ఆరు నూరైనా ఈ సినిమాను అనుకున్న టైమ్ కి రిలీజ్ చేస్తామని నిర్మాతలు కూడా శపథం చేశారు.

Also Read: బిగ్ ట్విస్ట్! 20 లక్షల సూట్ కేస్‏తో అవినాష్ అవుట్? మిడ్‏వీక్ ఎలిమినేషన్

'రాజా సాబ్' వాయిదా..

కట్ చేస్తే.. రెండు రోజుల క్రితమే ప్రభాస్ కు ఈ మూవీ షూటింగ్ లో చీలమండ బెణికిందని న్యూస్ వచ్చింది. దీంతో ప్రభాస్ సర్జరీ కోసం ఇటలీ వెళ్తున్నాడు. జనవరి ఎండింగ్ లో మళ్ళీ ఇండియాకు రిటర్న్ అవుతాడు. కాబట్టి అప్పటిదాకా 'రాజా సాబ్' షూటింగ్ జరగదు. సో ఈ మూవీ ఏప్రిల్ 10 కి రిలీజ్ కాదని కన్ఫర్మ్ అయింది. 

ఇక అదే ఏప్రిల్ 10 న సిద్దు జొన్నలగడ్డ తన లేటెస్ట్ మూవీ 'జాక్' ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే 'రాజా సాబ్' ఆ డేట్ నుంచి తప్పుకోవడంతో సిద్దు జొన్నలగడ్డ అదే డేట్ ను లాక్ చేశాడు. త్వరలోనే 'రాజా సాబ్' వాయిదాపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు