NTR- Kalyan Ram: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్..! సీక్రెట్ బయటపెట్టిన కళ్యాణ్ రామ్ ..

ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’, ‘డ్రాగన్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘డ్రాగన్’ అనంతరం ‘దేవర 2’ సెట్స్‌పైకి వెళ్తుందని తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ తెలిపారు.కాగా ఎన్టీఆర్ నెల్సన్‌తో చేయబోయే సినిమా 2027లో మొదలయ్యే అవకాశం ఉంది.

New Update
NTR- Kalyan Ram

NTR- Kalyan Ram

NTR- Kalyan Ram: టాలీవుడ్‌ యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ సినిమాల లైన‌ప్ పై అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘వార్ 2’లో బిజీగా ఉండగా, మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్టులపై కూడా అభిమానుల్లో ఆసక్తి భారీగా పెరిగింది.

Also Read: వాళ్లను అస్సలు పట్టించుకోను.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిపడేసిన మౌనీ రాయ్

ఇప్పటికే ఎన్టీఆర్ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెల్సన్ ‘జైలర్ 2’ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా ప్రారంభించనున్నట్లు టాక్‌ నడుస్తోంది. 

Also Read:అజిత్ ఎనర్జీ చూసి షాకయ్యా: సునీల్

‘దేవర’ సీక్వెల్‌ పై క్లారిటీ..

అయితే ఎన్టీఆర్ మరోసారి తన పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ‘దేవర’ సీక్వెల్‌ పై క్లారిటీ ఇచ్చారు. ‘దేవర 2’ తప్పకుండా ఉంటుందనీ, ‘డ్రాగన్’ పూర్తయ్యాక వెంటనే సెట్స్‌పైకి వెళ్తుందనీ తారక్ ఆల్రెడీ ఓ వేదిక పై చెప్పిన సంగతి తెలిసిందే, తాజాగా ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేసారు. కళ్యాణ్ రామ్ దేవర సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండడం విశేషం. 

Also Read:రెమ్యునరేషన్‌కు లింగ భేదం ఏంటీ..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సమంతా

ఇక దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులను పక్కన పెట్టి పూర్తిగా ‘దేవర 2’ స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా 2025లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

Also Read:'పెద్ది'తో రామ్ చరణ్ ఊచకోత.. ఇదయ్యా నీ అసలు రూపం..!

ఇక నెల్సన్- ఎన్టీఆర్ మూవీ విషయానికి వస్తే, దానికి కనీసం 2027 వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి తారక్ అభిమానులు  తమ అభిమాన హీరో నుండి వరుస బిగ్ బడ్జెట్ సినిమాలు రానుండడంతో పండగ చేసుకుంటున్నారు. 

Advertisment