/rtv/media/media_files/2025/04/15/7MfClUZ6goMYuO7K2cfZ.jpg)
Mouni Roy
Mouni Roy: బాలీవుడ్ గ్లామర్ డివా మౌనీ రాయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన పేరే... ముఖ్యంగా ‘నాగినీ’ సీరియల్ ద్వారా తెలుగువాళ్ల గుండెల్లో కూడా స్థానం సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ భామ, సోషల్ మీడియాలోనూ అందాల ఫోటోలతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది.
Also Read: అజిత్ ఎనర్జీ చూసి షాకయ్యా: సునీల్
అయితే ఇటీవల మౌనీ కొన్ని ఫోటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, నెటిజన్లు ఆమెను ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నదన్న వార్తలు వైరల్ కావడంతో ఆమె లుక్‌పై వివిధ రకాల వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మౌనీ ముంబయిలో జరిగిన తన కొత్త చిత్రం 'ది భూత్నీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించింది.
Also Read: రెమ్యునరేషన్‌కు లింగ భేదం ఏంటీ..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సమంతా
ఈ సందర్భంగా మౌనీ మాట్లాడుతూ..
‘‘ట్రోలింగ్ చేసే వాళ్లను నేను అస్సలు పట్టించుకోను. అటువంటి కామెంట్స్‌ను చదవను కూడా. ప్రతి ఒక్కరూ తమ పని తాము చేసుకోవాలి. నేనూ ఎప్పుడూ నా పనిలో బిజీగా ఉంటాను. తెర వెనుక దాక్కుని ఇతరులను నిందించడం ఎవరికైనా సరదా అయితే వారు అలాగే ఉండొచ్చు. అలంటి వాటికి నేనేమి ఫీల్ అవ్వను,’’ అంటూ ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చింది.
Also Read: 'పెద్ది'తో రామ్ చరణ్ ఊచకోత.. ఇదయ్యా నీ అసలు రూపం..!
ప్రస్తుతం మౌనీ ప్రధాన పాత్రలో నటించిన ‘ది భూత్నీ’ అనే హారర్ యాక్షన్ కామెడీ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆమె ‘మొహబ్బత్’ అనే దెయ్యం పాత్రలో కనిపించనుంది. సంజయ్ దత్, సన్నీ సింగ్, పాలక్ తివారీ, ఆసిఫ్ ఖాన్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ఇదే రోజు అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి 2’ కూడా రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద రెండు చిత్రాల మధ్య ఆసక్తికర పోటీ నెలకొననుంది.
Insaan mohabbat wali date fix kar sakta hai, bhootnii ke aane ki nahi... woh kab aayegi, kaise aayegi, yeh sirf wahi jaanti hai! 💀
— Mouni Roy Nambiar (@Roymouni) April 14, 2025
Laga tha 18th April ko aayegi lekin ab aa rahi hai 1st May ko, taiyaar rehna! 👀#TheBhootnii– in cinemas 1st May 2025! ✨ pic.twitter.com/f9XRHxQiE3
Also Read: ఆ ఒక్క విషయంలో వెనక్కి తగ్గిన ఎన్టీఆర్ 'వార్-2'