Good Bad Ugly: అజిత్ ఎనర్జీ చూసి షాకయ్యా: సునీల్

అజిత్‌ కుమార్‌(Ajith Kumar) లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ భారీ విజయం సాధించగా, అజిత్ ఎనర్జీ, సింప్లిసిటీపై సునీల్ ప్రశంసలు కురిపించారు.  ఫిట్‌నెస్‌లో, అజిత్ ధైర్యం, కట్టుదిట్టైన షూటింగ్ షెడ్యూల్‌ తనను ప్రభావితం చేసిందని తెలిపారు.

New Update
Good Bad Ugly

Good Bad Ugly

Good Bad Ugly: టాలీవుడ్‌ యాక్టర్‌ సునీల్‌(Sunil) తాజాగా తమిళ స్టార్‌ అజిత్‌ కుమార్‌తో(Ajith Kumar) కలిసి నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశారు. స్టైలిష్ గెటప్‌తో తనదైన పాత్రను చూపించి మల్టీ లెవెల్‌ టాలెంట్‌ను మరోసారి ప్రూవ్‌ చేసుకున్నారు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతూ థియేటర్లలో ఘన విజయాన్ని నమోదు చేస్తోంది.

Also Read: రెమ్యునరేషన్‌కు లింగ భేదం ఏంటీ..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సమంతా

ఈ సక్సెస్‌ను పురస్కరించుకొని బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న సునీల్‌ అజిత్‌ గురించి ఎంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. “అజిత్‌ ఎనర్జీ అసాధారణం. ఆయనలోని సింప్లిసిటీ చూసి నిజంగా ఆశ్చర్యపోయాను” అని పేర్కొన్నారు.

Also Read: 'పెద్ది'తో రామ్ చరణ్ ఊచకోత.. ఇదయ్యా నీ అసలు రూపం..!

9 కిలోమీటర్లు నడిచాం..

తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, “ఒకసారి అజిత్‌ నేను రన్నింగ్ కు వెళ్తుండగా  అయ్యన కూడా వస్తానని చెప్పారు. ఉదయం 4 గంటలకు ఆయనే స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చారు. దాదాపు 9 కిలోమీటర్లు నడిచాం. తర్వాత మియాపూర్‌లో షూటింగ్‌ ఉండడంతో గంటన్నర డ్రైవ్ చేసి అక్కడికి వెళ్లాం. ఇంటర్వెల్ ఫైట్‌ సీన్‌ 27 మంది నటులతో సింగిల్‌ టేక్‌లో చేసిన విధానం అద్భుతం. రీఎంట్రీ షూట్‌ అయినప్పటికీ, ఎటువంటి డూప్‌లేకుండా తానే చేశారు. అజిత్‌ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన నిజంగా ఒక లెజెండ్. భగవంతుడు ఆయనకు ఇంకా మంచి దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను,” అంటూ తన అనుభవాన్ని సునీల్‌ షేర్ చేసుకున్నారు.

Also Read: ఆ ఒక్క విషయంలో వెనక్కి తగ్గిన ఎన్టీఆర్ 'వార్-2'

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అజిత్‌తో కలిసి త్రిష హీరోయిన్‌గా నటించగా, జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సెన్సేషన్ సృష్టించింది. సస్పెన్స్‌, యాక్షన్, మాస్ అంశాలతో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది.

Also Read: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు