PVCU: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మరో సూపర్ హీరో.. 'అధీర' నుంచి అదిరిపోయే అప్డేట్!

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రతి ఏడాది ఓ సినిమా ప్రేక్షకులను అలరించనున్నట్లు  ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా మరో కొత్త సినిమా ప్రకటించారు.

New Update
ADHIRA

ADHIRA

PVCU:డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రతీ ఏడాది ఓ సినిమా ప్రేక్షకులను అలరించనున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా మరో కొత్త సినిమా ప్రకటించారు.

అధీర అప్డేట్

'అధీర' అనే టైటిల్ తో ఓ సూపర్ హీరో చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఇందులో ఎస్. జే సూర్య, కళ్యాణ్ దాసరి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ''ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు వెలుగు రూపంలో ఆశ పుట్టుకొస్తుంది'' అంటూ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు.ఇందులో ఎస్. జే సూర్య లుక్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఇంతక ముందెప్పుడూ చూడని ఒక డిఫరెంట్ లుక్ లో ఆయన కనిపించారు. 

ఇప్పటికే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి  సూపర్ హీరో ఫిల్మ్  'హను-మ్యాన్'  బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో అతడి రాబోయే సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Also Read :  'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి గూస్ బంప్స్ అంతే!

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మొత్తం 20 స్క్రిప్ట్స్ సిద్దమవుతున్నాయి.  వీటిలో మొదటి 6 చిత్రాలు సూపర్ హీరో కథలని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే 'హనుమాన్ ', ' జై హనుమాన్ ' చిత్రీకరిస్తున్నారు. ఆ  తర్వాత మూడవ సూపర్ హీరో చిత్రంగా 'మహాకాళీ' అనౌన్స్ చేశారు. ఇప్పుడు నాల్గవ ప్రాజెక్ట్ గా 'అధీర'  ప్రకటించారు. 

శరన్ కొప్పిశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రశాంత్ వర్మ పర్యవేక్షణలో రూపొందుతోంది.  నిర్మాత దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి ఇందులో సూపర్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ సగం పూర్తవగా.. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారని సమాచారం.  ఈ నెల 25న విడుదల కాబోతున్న ఓజీ సినిమాలో అధీర గ్లింప్స్ వీడియో చూపించనున్నట్లు తెలుస్తోంది. 

so Read :  జార్జ్ కుట్టీ వచ్చేస్తున్నాడు.. ఈసారి సస్పెన్స్ పీక్స్!

Advertisment
తాజా కథనాలు