/rtv/media/media_files/2025/09/22/drishyam-three-2025-09-22-12-34-42.jpg)
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మేరకు పూజ కార్యక్రమాలతో నిర్వహించారు.
/rtv/media/media_files/2025/09/22/drishyam-3-two-2025-09-22-12-34-42.jpg)
హీరో మోహన్ లాల్ సినిమాకు క్లాప్ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/09/22/drishyam-3-one-2025-09-22-12-34-42.jpg)
దృశ్యం ఫ్రాంచైజీలో భాగంగా ఇప్పటికే విడుదలైన 'దృశ్యం' పార్ట్ 1 అండ్ 2 చిత్రాలు సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన కథలు ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేశాయి.
/rtv/media/media_files/2025/09/22/drishyam-3-2025-09-22-12-34-42.jpg)
పార్ట్ 3లో ఈ రెండు భాగాలకు మించిన సస్పెన్స్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇది కూడా జార్జ్ కుట్టీ ( మోహన్ లాల్) తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది.
/rtv/media/media_files/2025/09/22/drishyam-3-one-2025-09-22-12-34-42.jpg)
అంతేకాదు దృశ్యం 3 లో.. జార్జ్ కుట్టి కుటుంబం గురించి కొన్ని ఊహించని విషయాలు బయటపడతాయని, కథలో కొత్త మలుపులు ఉంటాయని తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/09/22/drishyam-3-two-2025-09-22-12-34-42.jpg)
"దృశ్యం 2" క్లైమాక్స్ లో పోలీసులు బయటకు తీసిన అస్థిపంజరం వరుణ్ ది కాదని బయటపడుతుంది. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపు తిరిగింది అనేది 'దృశ్యం 3' చూపించబోతున్నారు డైరెక్టర్
/rtv/media/media_files/2025/09/22/drishyam-3-one-2025-09-22-12-34-42.jpg)
మోహన్ లాల్ తో పాటు మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, మళ్ళీ తిరిగి కనిపించబోతున్నారు.