Dil Raju : ఆమీర్ ఖాన్ తో దిల్ రాజు సినిమా.. డైరెక్టర్ ఎవరో తెలుసా? ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ తో ఓ సినిమా చేయనున్నారట. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారట. వంశీపైడిపల్లి ఇటీవలే అమీర్ ఖాన్‌కు సినిమా లైన్‌ను వినిపించగా ఆయన ఎక్సయిట్ అయ్యి ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. By Anil Kumar 14 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ వైపు స్టార్ హీరోలతో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూనే మరోవైపు మీడియం రేంజ్ సినిమాలను నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ నిర్మాత నుంచి గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి బడా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో.. ఇదిలా ఉంటే దిల్ రాజు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయనున్నట్లు లేటెస్ట్ న్యూస్ బయటకొచ్చింది. ఇటీవలే ఆమీర్ ఖాన్ ను కలిసిన ఆయన.. ఓ ప్రాజెక్ట్ విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారట. వంశీపైడిపల్లి ఇటీవలే అమీర్ ఖాన్‌కు సినిమా లైన్‌ను వినిపించగా.. ఎక్జయిట్ అయిన అమీర్ ఖాన్ పూర్తి స్క్రిప్ట్‌తో రావాలని సూచించాడట. Also Read: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. ఆరు భాషల్లో స్వామి చాట్‌బాట్ #GameChanger event may be #AmirKhan might comeNot #SRKBecause #DilRaju is planning a movie with #AmirKhanDirector #Vamshipadipally Let's see #Raamachamacha pic.twitter.com/dkz5eyv448 — upcoming Gossips (@Upcomingchat) November 13, 2024 Also Read : 'స్పిరిట్' 6 నెలల గ్యాప్ లోనే పూర్తి చేస్తాం.. రిలీజ్ అప్పుడే: నిర్మాత దీంతో వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేయగా.. త్వరలోనే దిల్ రాజు ముంబై వెళ్లి అమీర్‌ఖాన్‌ను కలువబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఈ ప్రాజెక్ట్ తోనే ఆమీర్ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఉండబోతుందని చెప్పొచ్చు. ఇక వంశీ పైడిపల్లి తెలుగు స్టార్ హీరోలతో పాటూ కోలీవుడ్ హీరో దళపతి విజయ్ తో 'వారిసు' (వారసుడు) లాంటి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా తీసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ తో ఎలాంటి జోనర్ లో సినిమా తెరకెక్కిస్తాడో చూడాలి. Also Read : 'సంక్రాంతికి వస్తున్నాం' ఫస్ట్ సింగిల్.. వెంకీ మామ కోసం రమణ గోగుల పాట ఇది కూడా చూడండి: Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ #Vamsi paidipally #aamir-khan #dil-raju మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి