/rtv/media/media_files/2025/04/20/yxVIZAihPO3K6esL8uZv.jpg)
Kubera First Song
Kubera First Song: ‘కుబేరా’తో ధనుష్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula), ముఖ్య పాత్రలో అక్కినేని నాగార్జున(Nagarjuna) కనిపించనున్నారు. ఈ సినిమా ఇప్పటికే మంచి హైప్‌ను సొంతం చేసుకుంది.
Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిన చిత్ర బృందం, భాస్కర్ భట్ల. రాసిన మొదటి పాట ‘పోయిరా మామ’ను తాజాగా విడుదల చేశారు. ఈ పాటను స్వయంగా ధనుష్ తెలుగులో పాడడం విశేషం. ఈ మూవీకి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్.
Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..
జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో
అయితే, ఈ పాటలో ధనుష్ చేసిన మూమెంట్స్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా, జిమ్ సార్భ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల సంయుక్త నిర్మాణంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: ఫ్యాన్స్ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..
‘కుబేరా’ సినిమా 2025 జూన్ 20న పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంగీతం, కథ పరంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోనుంది.
Also Read: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?