Aishwarya: రజనీకాంత్ కూతురు, అల్లుడికి ఫ్యామిలీ కోర్టు నోటీసులు!
నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దంపతులకు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు పంపింది. విడాకుల విషయంలో అక్టోబర్ 7న ఇద్దరూ కోర్టులో హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.