/rtv/media/media_files/2024/11/21/VnaqrJ0IqD2DpwfFlgsz.jpg)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు, రేపు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. నగంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమంలో ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆమె నగరంలో రెండ్రోజుల పాటు పర్యటించనుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: నారాయణపేటలో ఘోరం.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత
ఆమె పర్యటన సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు భద్రతా పరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నేడు, రేపు (గురు వారం, శుక్రవారం) పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మనుషులను చంపేస్తున్న మూఢనమ్మకాలు.. పాముకాటు తర్వాత ఇలా చేస్తే అంతే సంగతి!
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) November 21, 2024
Commuters are urged to note the #TrafficAdvisory in view of the visit of Hon’ble President of India to Hyderabad on 21 and 22 Nov-2024.#TrafficAlert #TrafficRestrictions #TrafficDiversions pic.twitter.com/cg5gpB0VMh
ఇవాళ ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఈ మేరకు ఏ ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అనే వివరాల్ని హైదరాబాద్ నగర్ అదనపు పోలీస్ కమిషనర్ పి.విశ్వప్రసాద్ తెలిపారు. ఇవాళ సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పంజాగుట్ట జంక్షన్, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్ ఫ్లైఓవర్, పీపీఎన్‌టీ ఫ్లైఓవర్, హెచ్‌పీఎస్ ఔట్‌గేట్, శ్యాంలాల్ బిల్డింగ్, ఎయిర్‌పోర్టు జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్, కాకతీయ హోటల్, పీవీ విగ్రహం, మెట్రో రెసిడెన్సీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, రాజ్ భవన్ రోడ్, నెక్లెస్ రోడ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, తెలుగు తల్లి జంక్షన్, కట్టమైసమ్మ, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం జంక్షన్, అశోక్‌నగర్ జంక్షన్, ఇక్బాల్ మినార్, ఎన్టీఆర్ స్టేడియం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు పేర్కొన్నారు.
Also Read: చెల్లి ఫొటోతో ఎఫ్‌బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
రేపు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
అలాగే రేపు (నవంబర్ 22)న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అందులో మాదాపూర్, రాయదుర్గం, కొత్తగూడ, కొండాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అందువల్ల ఆయా ప్రాంతాల్లోని వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్ని చూసుకోవాలని సైబరాబాద్ జయింట్ సీపీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఫుడ్ ప్యాకింగ్‌కు అల్యూమినియం ఎలా ఉపయోగించాలి?
ఇందులో భాగంగానే నగరంలో ట్రాఫిక్ సమాచారం కోసం 85004 11111 ట్రాఫిక్ హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోటి దీపోత్సవం కార్యక్రమంతో పాటు మాదాపూర్‌లోని శిల్పకళా వేదికగా నిర్వహించే లోక్ మంతన్ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 120 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.