Crime News: ప్రసాదం పెట్టలేదని పిడిగుద్దులు గుద్ది, కర్రలతో కొట్టి చంపిన యువకులు! వీడియో వైరల్

ప్రసాదం పెట్టలేదని ఆలయ సిబ్బందిని కర్రలతో కొట్టి, పిడిగుద్దులు గుద్ది చంపేశారు కొందరు యువకులు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని  ఢిల్లీలో జరిగింది. చనిపోయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ కి చెందిన యోగేంద్ర సింగ్ గా గుర్తించారు.

New Update
Delhi temple sewadar

Delhi temple sewadar

ప్రసాదం పెట్టలేదని ఆలయ సిబ్బందిని కర్రలతో కొట్టి, పిడిగుద్దులు గుద్ది చంపేశారు కొందరు యువకులు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని  ఢిల్లీ(delhi) లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ కి చెందిన యోగేంద్ర సింగ్ గత 15 సంవత్సరాలుగా ఢిల్లీలోని కల్కాజీ ఆలయ సేవకుడిగా పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కొంతమంది యువకులు దర్శనం కోసం ఆలయానికి వచ్చారు. దర్శనం అనంతరం ఆలయ సేవకుడు యోగేంద్ర సింగ్ ప్రసాదం పెట్టాలని డిమాండ్ చేశారు. దీనికి యోగేంద్ర సింగ్ నిరాకరించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త హింసాత్మక దాడిగా మారింది. 

కొట్టి చంపిన యువకులు 

ప్రసాదం పెట్టలేదని(Denying Of Prasad) కోపంతో విచక్షణ కోల్పోయిన యువకులు ఆలయ సిబ్బంది యోగేంద్రను కర్రలతో చితకబాదారు. పిడిగుద్దులు గుద్దుతూ, పదేపదే కర్రలతో కొట్టడంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.  చుట్టూ పక్కల ఉన్నవారు వెంటనే బాధితుడిని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించగా.. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ యోగేంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

ఈ ఘటన పై "BNS సెక్షన్ 103(1)/ 3(5) కింద సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే నిందితుల్లో ఒకడైన దక్షిణపురి నివాసి అతుల్ పాండే (30) ని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే  అతుల్ పాండే అనే యువకుడిని స్థానికులు సంఘటన స్థలంలోనే పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మిగతావారు తప్పించుకోగా.. పోలీసులు గాలిస్తున్నారు. 

Also Read: TG Crime: మండపం వద్ద పాటలు పెడుతుండగా కరెంట్ షాక్.. నల్గొండలో పెను విషాదం!

Advertisment
తాజా కథనాలు