Prabhas - Deepika: రీసెంట్ గా మన టాలీవుడ్(Tollywood) లో ఒకే హీరోతో వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ సినిమాలు చేసే ఛాన్స్ హీరోయిన్లకి దక్కడం లేదు. సాధారణంగా సినిమా సినిమాకి కొత్త హీరోయిన్లను మార్చేస్తుంటారు మన హీరోలు. కానీ గతంలో ప్రభాస్‌తో రెండు చిత్రాల్లో నటించిన అరుదైన హీరోయిన్ అనుష్క శెట్టి. ఆ తర్వాత అలాంటి అవకాశాన్ని ఎవరూ పొందలేదు. కానీ ఇప్పుడు ఆ లక్కీ ఛాన్స్ దీపిక పదుకోన్‌కు దక్కినట్టే కనిపిస్తోంది.
Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‌లో టెన్షన్ టెన్షన్..!
ప్రస్తుతం ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'కల్కి 2898 A.D పార్ట్ 2'(Kalki Part 2) లో దీపిక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ మరో ప్రాజెక్ట్‌లోనూ దీపికకు అవకాశమొచ్చిందట.
'స్పిరిట్'లో దీపిక..
సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందనున్న 'స్పిరిట్'(Spirit) సినిమాలో కూడా ప్రభాస్ సరసన దీపిక నటించబోతోందని సమాచారం. ఇలా ప్రభాస్ సరసన వరుసగా మూడు సినిమాల్లో నటించే అవకాశం దీపిక పదుకోన్‌కు దక్కనుంది.ఇప్పుడు బాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
ఇక యానిమల్ సినిమాలో రష్మిక మందన్నాను విభిన్నంగా చూపించిన వంగా, స్పిరిట్ కోసం దీపికకు కూడా ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ను డిజైన్ చేశాడట. దీపిక పాత్ర స్పిరిట్ సినిమాకే హైలైట్ అవుతుందని టాక్.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మొదటగా ఈ సినిమా ఆఫర్ దీపిక వద్దకు చాలా ముందే వెళ్లిందట. కానీ అప్పట్లో గర్భవతిగా ఉండటంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో మళ్లీ ఆమెను సంప్రదించి కాల్షీట్లు కన్‌ఫర్మ్ చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
ఇదే జరిగితే దీపికా పదుకోన్, ప్రభాస్ సరసన వరుసగా మూడు సినిమాల్లో నటిస్తున్న ఏకైక హీరోయిన్‌గా రికార్డు నెలకొల్పబోతుంది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్‌కే కాదు, దీపిక అభిమానులకూ కూడా ఫుల్ కిక్కిచ్చే వార్త అనే చెప్పాలి.