Salaar Re-Release: రీ-రిలీజ్ రికార్డులు బద్దలు కొట్టిన 'సలార్'.. అరాచకం సామి ఇదీ!!

బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ రీ రిలీజ్ బీభత్సం సృష్టించింది. డే 1 సాలిడ్ ఓపెనింగ్స్ తో ఓవరాల్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 1.60 కోట్లగా నిలిచింది. మన తెలుగు రాష్ట్రాల్లో సలార్ కి ఎక్కువ టికెట్లు తెగడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

New Update
Salaar Re-Release

Salaar Re-Release

Salaar Re-Release: బాక్స్ ఆఫీస్(Box Office) దగ్గర సలార్ రీ రిలీజ్ కుమ్ముడు కుమ్ముతుంది. పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన మాస్ మూవీ సలార్(Salaar)సినిమా ఈరోజు(శుక్రవారం) గ్రాండ్ గా రీ- రీ రిలీజ్ అయ్యింది. కాగా ప్రీ బుకింగ్స్(Salaar Pre Bookings) లో సలార్ బీభత్సం సృష్టించింది. 

Also Read:లారెన్స్ మామూలోడు కాదుగా.. ఈ సారి ఏ దెయ్యానికి బాడీ అద్దెకు ఇస్తున్నాడంటే..?

బుకింగ్స్ పరంగా సలార్ మాస్ కుమ్ముడు కుమ్మేసింది. ప్రభాస్ నటించిన సినిమాల్లో రీ రిలీజ్ అయిన అన్ని సినిమాలలోకల్లా సలార్ సినిమా  సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దాదాపుగా 840 షోలకుగాను ఆన్ లైన్ లో ఆల్ మోస్ట్ 85 వేలకు పైగా టికెట్స్ సేల్ చేసి మాస్ రచ్చ లేపింది. ఈ ప్రకారం  డే 1 సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకోవడాం పక్కా. అయితే తాజా లెక్కల చూసుకుంటే ఓవరాల్ గా(Salaar Re ReleaseTotal Collections) అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 1.60 కోట్ల దాకా రావడం విశేషం. 

Also Read:దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?

మొదటి రోజు కలెక్షన్స్..

ఇండియాలో అన్ సీజన్ లో ఈ రేంజ్ బుకింగ్స్ తో దూసుకెళ్తోంది సలార్  మన తెలుగు రాష్ట్రాల్లో సలార్ కి ఎక్కువ టికెట్లు తెగడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అందులోను తెలంగాణలో 68 లక్షలు, ఏపీలో 59 లక్షలు, కర్ణాటకలో 19 లక్షల అడ్వాన్స్ బుకింగ్స్ తో చెలరేగిపోయింది సలార్. ఇక హైదరాబాద్‌ విషయానికి వస్తే 55 లక్షల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ చేసి సంచలం సృష్టించింది. మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సలార్ సాలిడ్ ఓపెనింగ్స్ రాబడుతూ ఫస్ట్ డే 1.60 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ తో దుమ్ము దులిపేసింది. 

Also Read:నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!

అయితే, డే 1 ఆఫ్ లైన్,  స్పాట్ బుకింగ్స్ లెక్కల పై ఇంకా ప్రకటన రాలేదు. అవి కూడా ఆన్లైన్ బుకింగ్స్ లాగానే సాలిడ్ గా ఉంటె మాత్రం ప్రభాస్ రీ  రిలీజ్ రికార్డ్స్ లోనే కాకుండా, ఓవరాల్ గా టాలీవుడ్ టాప్ రీ రిలీజ్ ఓపెనింగ్స్ లిస్ట్ లో ఒకటిగా సలార్ చేరడం పక్కా. మరి సలార్ రీ  రిలీజ్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 

Also Read:రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

Advertisment
తాజా కథనాలు