/rtv/media/media_files/2025/08/13/coolie-vs-war-2-2025-08-13-09-51-42.jpg)
Coolie vs War 2
Coolie vs War 2: ఇంకా ఒకే ఒక్క రోజు ఉంది.. రేపు (ఆగస్టు 14న) భారీ స్థాయిలో రెండు పాన్-ఇండియా సినిమాలు రజనీకాంత్ నటించిన కూలీ, హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్ 2 విడుదలకానున్న. అయితే ఈ రెండు మూవీస్ మధ్య బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూస్తే "కూలీ" రికార్డు బుకింగ్స్ తో ముందే విజయాన్ని నమోదు చేసిందనే చెప్పొచ్చు.
ఇండియా వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలివే.. (Coolie vs War 2 Advance Bookings)
కూలీ (Coolie)
బుక్కైన టిక్కెట్లు: 9,11,730
గ్రాస్ కలెక్షన్ (బ్లాక్ సీట్లతో కలిపి): ₹26.28 కోట్లు
Also Read: ఏమయ్యా అనిరుధ్.. ఏంటిది ఇంత పని చేశావ్..?
వార్ 2 (War 2)
బుక్కైన టిక్కెట్లు: 1,29,750
గ్రాస్ కలెక్షన్ (బ్లాక్ సీట్లతో కలిపి): ₹8.67 కోట్లు
రజనీకాంత్ మరోసారి తన స్టార్ పవర్ ఏంటో నిరూపించుకున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం, అనిరుధ్ సంగీతం, పవర్‌ఫుల్ కథాంశం అన్నీ కలసి “కూలీ” మూవీ ఫస్ట్ డే నే బాక్సాఫీస్ ని షేక్ చేయనున్నాయి.
అంతర్జాతీయంగా కూడా “కూలీ” తన సత్తా చూపిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ అడ్వాన్స్ బుకింగ్స్ ₹85 కోట్ల దాటాయి. త్వరలోనే ₹100 కోట్ల మార్కును అందుకోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరోవైపు, వార్ 2 హిందీ బెల్టులో ఆశించిన స్థాయిలో స్పందన రాబట్టుకోలేకపోయింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ ఉన్న కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ రాబోయే రోజుల్లో పుంజుకుంటాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Hyderabad (BMS) Pre-Sales – Total#War2: 625 shows | 1,22,002 seats | ₹2.84 Cr gross | ~53% occupancy#Coolie: 487 shows | 1,34,464 seats | ₹3.18 Cr gross | ~87.5% occupancy#Rajinikanth's Coolie beats War 2 in Hyd with more sales, higher occu.
— NexusRift 🚩 (@SRKsNexusRift) August 13, 2025
pic.twitter.com/Uc1kMPXa3Z
Also Read: అమెరికాలో 'కూలీ' ఊచకోత! విడుదలకు ముందే అన్ని కోట్ల వసూళ్లు చేసిన తొలి తమిళ్ సినిమా!
హైదరాబాద్ లో 'కూలీ' జోరు.. (Coolie vs War 2 Hyderabad Bookings)
హైదరాబాద్ ప్రీ-సేల్స్ - BMS డేటా
కూలీ (Coolie)
షోలు: 487
సీట్లు: 1,34,464
గ్రాస్ కలెక్షన్: ₹3.18 కోట్లు
ఆక్యుపెన్సీ: 87.5%
వార్ 2 (War 2)
షోలు: 625
సీట్లు: 1,22,002
గ్రాస్ కలెక్షన్: ₹2.84 కోట్లు
ఆక్యుపెన్సీ: 53%
తక్కువ షోలు ఉన్నప్పటికీ కూలీ ఎక్కువ సీట్లు సేల్ చేసి, ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది. దీంతో రజనీకాంత్ అభిమానుల క్రేజ్ ఏ లెవెల్లో ఉంది అర్థమవుతోయింది.
Also Read:కూలీ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్..
ఇక కూలీ సినిమా విషయానికొస్తే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రజనీకాంత్ "దేవా" అనే పాత్రలో నటిస్తున్నారు. ఒకప్పుడు స్మగ్లర్‌గా పేరు తెచ్చుకున్న వాడు. మళ్లీ ఒక అవినీతి మాఫియాకి వ్యతిరేకంగా తిరిగి వచ్చి ఎలా పోరాడాడు అన్నదే కథ. ఈ మూవీ లో నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, అమిర్ ఖాన్ (కెమియోలో) నటిస్తున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చింది, నిడివి సుమారుగా 170 నిమిషాలు.
ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే “కూలీ” డామినేషన్ క్లీర్గా కనిపిస్తోంది. వార్ 2 కి కూలీ గట్టి పోటీని ఇస్తుందనే చెప్పాలి. అయితే, విడుదల తరువాత మాటేమో చూడాలి. బాక్సాఫీస్ వద్ద ఎవరు నిలబడతారో ఇంకొక్క రోజులో ప్రేక్షకులే తేలుస్తారు!
Also Read:‘కూలీ’ మూవీ స్టార్ కాస్ట్.. ఎవరు ఎంత తీసుకున్నారంటే..?