Coolie: ఏమయ్యా అనిరుధ్.. ఏంటిది ఇంత పని చేశావ్..?

కూలీ ట్రైలర్‌లో వినిపించిన “అలేలా పోలెమా” అనే మాటకు అర్థం లేదని, స్టూడియోలో రాండమ్‌గా పాడిన గిబ్బరిష్ పదం అని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ చెప్పుకొచ్చారు. కానీ తర్వాత గూగుల్‌లో చూస్తే అది గ్రీకు భాషలో "పోరాటానికి సిద్ధం" అన్న అర్థం వస్తుందని తెలిసిందట.

New Update
Coolie

Coolie

Coolie: కూలీ మూవీ ట్రైలర్‌లో వినిపించిన "అలేలా పోలెమా"(Alelapolema Coolie) అన్న ఆ పదానికి విచిత్రమైన కథ ఉంది. చాలా రోజులుగా వైరల్ అవుతున్న ఉన్న ఈ మ్యూజిక్ ఫ్రేమ్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఇటీవల ఓ ప్రమోషన్ సందర్భంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కూలీ సినిమా ట్రైలర్ లో వినిపించిన “అలేలా పోలెమా” అనే మాటకు అసలు అర్థం ఉందా, లేక అనిరుధ్ స్టూడియో నుండి పుట్టుకొచ్చిన పదమా అని సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు.

Also Read:అమెరికాలో 'కూలీ' ఊచకోత! విడుదలకు ముందే అన్ని కోట్ల వసూళ్లు చేసిన తొలి తమిళ్ సినిమా!

అయితే అనిరుధ్ రవిచందర్ ఒక ప్రమోషన్ లో మాట్లాడుతూ, “కూలీ మూవీ టీజర్ కట్(ట్రైలర్) రెడీ చేస్తున్నప్పుడు, నాకిష్టమైన కొన్ని పాటల లైన్లు స్టూడియోలో నాకు అనిపించిన భావాలను బుల్లెట్‌లా బయటకు వదిలేస్తూ పాడుతుంటాను. అలాగా ఒకసారి 'అలేలా…పోలెమా… అలేలా…పోలెమా... అల్లే…!' అని ఒక మాట వచ్చింది. అది పూర్తిగా నాకు వచ్చిన ఆలోచన మాత్రమే” అని అన్నారు. అయితే ఈ మాటను ఆయన దర్శకుడు లోకేష్ గారికి పంచించారట. అది విన్న వెంటనే లోకేష్ కి బాగా నచ్చేసిందట దీని అర్థం అర్థం ఏంటి? అని అడుగుతారనుకుంటే లోకేష్ మాత్రం టీజర్ లో ఆ బిట్ తనకి నచ్చిన బెస్ట్ పార్ట్ అని చెప్పారట. 

Also Read: కూలీ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఇంకా అనిరుధ్ మాట్లాడుతూ “నేను ఆ పదాన్ని కావాలని అనుకోలేదు. అది రాండమ్‌గా, పిచ్చగా వచ్చేసింది. అది ఒక గిబ్బరిష్ వర్డ్ (అర్ధం లేని పదం) కానీ వింత ఏంటంటే తర్వాత గూగుల్‌లో చూసినప్పుడు గ్రీకు భాషలో 'నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను' అన్న అర్థం వస్తుందని తెలిసింది. కానీ నాకు గ్రీక్ రాదూ అది నిజంగా ఒక సరదాగా వచ్చిన మాటే” అని సరదాగా చెప్పుకొచ్చారు.

ఇక కూలీ మూవీ విషయానికొస్తే, తమిళ భాషలో తెరకెక్కి మిగతా భాషల్లోకి డబ్ అయ్యి రిలీజ్ అవుతున్న మూవీ కూలీ.. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ మూవీలో హీరోగా ఒక కూలీ(దేవా) పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇందులో నాగార్జున, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ ఇలా ఒక్కో ఇండస్ట్రీ నుండి ఒక్కో స్టార్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఆగస్టు 14, 2025 విడుదల.. 

“కూలీ” సినిమా అతి త్వరలో రేపు (ఆగస్టు 14, 2025న) థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్‌లో వినిపించిన “అలేలా పోలెమా” బీట్ కి మంచి రెస్పాన్స్ వస్తుండడం తో దాన్ని కూలీ మ్యూజిక్ ఆల్బమ్ లో కూడా 'MOBSTER' పేరుతో ఆడియో ట్రాక్ ను యాడ్ చేశారు మూవీ టీమ్.

Also Read: ‘కూలీ’ మూవీ స్టార్ కాస్ట్.. ఎవరు ఎంత తీసుకున్నారంటే..?

అనిరుధ్ రవిచందర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్..

 “కూలీ” తరువాత అనిరుధ్ లైనప్‌లో చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సివాకార్తికేయన్ చిత్రం “మధరాసి”, “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK)”, అలాగే దళపతి విజయ్ “జన నాయగన్” వంటి క్రేజీ మూవీస్ చేస్తున్నారు అనిరుధ్. 

Advertisment
తాజా కథనాలు