Coolie First Review: ఉదయనిధి స్టాలిన్‌ 'కూలీ' ఫస్ట్ రివ్యూ.. అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అంటూ పోస్ట్!

రాజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న ‘కూలీ’పై తొలి రివ్యూను ఉదయనిధి స్టాలిన్ ఇచ్చారు. ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించబోతుందని ఆయన X వేదికగా పోస్ట్ చేశారు. మరి, థియేటర్లలో ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి!

New Update
Coolie First Review

Coolie First Review

Coolie First Review: సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’(Coolie Movie) విడుదలకు ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. ఆగస్ట్ 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఫ్యాన్స్‌ మధ్య భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) ఈ సినిమాను ముందుగానే చూసే అదృష్టం పొందారు. అంతే కాదు, ఆయన ఈ చిత్రంపై ఫస్ట్ రివ్యూ(Coolie Movie Review) ను సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

Also Read: ఇది కదా కిక్ అంటే..! కూలీ 'మోనికా' సాంగ్ పై హాలీవుడ్ హాట్ బ్యూటీ కామెంట్స్ వైరల్..

ఉదయనిధి స్టాలిన్ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా రజనీకాంత్‌కు 50 సంవత్సరాల సినీ ప్రయాణం సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజనీకాంత్ సార్‌కు హృదయపూర్వక అభినందనలు. రేపు విడుదల కానున్న ‘కూలీ’ సినిమాను ముందుగా చూసే అవకాశం దక్కడం నాకు గర్వంగా ఉంది. ఈ సినిమా ఒక పవర్‌పుల్ మాస్ ఎంటర్‌టైనర్. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. ఇది ప్రేక్షకుల మనసులు దోచుకోవడం ఖాయం’’ అని ఉదయనిధి పేర్కొన్నారు.

ఉదయనిధి పోస్ట్‌కు స్పందనగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సినిమా మీకు నచ్చడం మాకు చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఆయనతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, నటులు నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్,  ఆమిర్ ఖాన్ తదితరులకు ఉదయనిధి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:'కూలీ' దెబ్బ అదుర్స్ కదూ..! బుకింగ్స్ లో 'వార్' వన్ సైడ్..

రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్.. 

‘కూలీ’ సినిమా ఇప్పటికే ఉత్తర అమెరికాలో అత్యంత ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన మొదటి కోలీవుడ్ సినిమాగా నిలిచింది. ఈ చిత్రం $2 మిలియన్ మార్కును క్రాస్ చేసి తలైవా స్టార్ పవర్‌ ను ప్రూవ్ చేసింది. ఇదివరకు ఈ రికార్డ్ రజనీకాంత్ కబాలి ($1.9 మిలియన్) పేరిట ఉండగా, ఇప్పుడు కూలీ దానిని దాటేసింది.

Also Read: ఏమయ్యా అనిరుధ్.. ఏంటిది ఇంత పని చేశావ్..?

ఇంకా విజయ్ నటించిన లియో, దీ గోట్, పొన్నియిన్ సెల్వన్ 1, జైలర్ సినిమాలు ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు రజనీకాంత్ - లోకేష్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమా వాటన్నింటినీ దాటే వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

‘కూలీ’పై అంచనాలు పీక్స్‌.. 

ఈ మాస్ ఎంటర్‌టైనర్‌పై తమిళ ప్రేక్షకులతో పాటు, ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం, రజనీకాంత్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read: అమెరికాలో 'కూలీ' ఊచకోత! విడుదలకు ముందే అన్ని కోట్ల వసూళ్లు చేసిన తొలి తమిళ్ సినిమా!

Advertisment
తాజా కథనాలు