Coolie Monica Song: ఇది కదా కిక్ అంటే..! కూలీ 'మోనికా' సాంగ్ పై హాలీవుడ్ హాట్ బ్యూటీ కామెంట్స్ వైరల్..

కూలీ సినిమాలోని ‘మొనికా’ పాటను ఇటాలియన్ నటి మొనికా బెలూచ్చి చూసి మెచ్చినట్టు పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. Marrakech ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ మెలిటా టుస్కాన్ ఈ పాటను ఆమెకు చూపించగా, పాట ఆమెకు బాగా నచ్చిందట.

New Update
Coolie Monica Song

Coolie Monica Song

Coolie Monica Song: లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన రజనీకాంత్(Rajinikanth) పాన్-ఇండియా మూవీ ‘కూలీ’(Coolie Movie) ఇప్పటికే విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ఇందులో అనిరుధ్ అందించిన స్పెషల్ సాంగ్ ‘మొనికా’ అందరిని ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఈ పాటలో హీరోయిన్ పూజా హెగ్డేని ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

అయితే ఈ పాటకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పూజా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ‘మొనికా’ అనే పాటను ఇటాలియన్ ఫిలిం స్టార్ 'మొనికా బెలూచ్చి' చూసినట్టు చెప్పింది. మరి ఆమెకు ఆ పాట గురించి ఏమనిపించిందో తెలుసుకుందాం.

Also Read: 'కూలీ' దెబ్బ అదుర్స్ కదూ..! బుకింగ్స్ లో 'వార్' వన్ సైడ్..

మొనికా బెలూచ్చి(Monica Bellucci) మెచ్చిన 'మొనికా'..!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో, పూజా హెగ్డేకి ఒక పెద్ద షాకింగ్ సర్ప్రైజ్ తెలిపింది. Marrakech ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది మొరాకోలోని మర్రకేచ్‌లో ప్రతి సంవత్సరం నిర్వహించబడే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వేదికగా డైరెక్టర్ మెలిటా టుస్కాన్ మొనికా బెలూచ్చికి ఈ పాటను చూపించగా, ఆమెకి పాట చాలా నచ్చిందట. ఈ విషయం పూజా హెగ్డే కి చాలా ఆనందాన్ని ఇచ్చినట్లు చెప్పింది.

"ఇది నాకు వచ్చిన అతిపెద్ద ప్రశంస. నాకు మొనికా బెలూచ్చి అంటే ఎప్పటినుంచో ఇష్టం. ఆమె వాయిస్, స్టైల్ అంతా చాలా ప్రత్యేకం. ఈ పాట ఆమెకు నచ్చినందుకు నాకు చాలా సంతోషం గా ఉంది." అంటూ చెప్పుకొచ్చింది. అయితే డైరెక్టర్ లోకేష్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లు కూడా మోనికా బెలూచ్చి కి పెద్ద ఫ్యాన్స్అట. అందుకే ఈ పాటకు ముందుగా ఆమె పేరునే పెడదామని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల పూజా హెగ్డే పేరు పెట్టమని ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. 

అంతేకాదు, త‌మిళ అభిమానులు మొనికా బెలూచ్చి ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కామెంట్లు పెట్టి “కూలీ” పాటను చూడమని చెబుతున్నారు అని కూడా పూజా చెప్పింది.

Also Read:ఏమయ్యా అనిరుధ్.. ఏంటిది ఇంత పని చేశావ్..?

పూజా మాట్లాడుతూ, “బుట్ట బొమ్మ, అరబిక్ కుతు, కనిమా లాంటి హిట్ సాంగ్స్ చేశాను. కానీ 'మొనికా' పాట మాత్రం చాలా కష్టంగా అనిపించింది,” అని అన్నారు. “ఇది బయట పోర్ట్ ఏరియాలో షూట్ జరిగింది, అందువల్ల గాలీ, జిడ్డు ఎక్కువగా ఉండడంతో షూటింగ్ టైమ్ లో బాగా చమట పట్టేదని, అయినా సరే స్క్రీన్‌పై మంచిగా కనిపించేందుకు తానూ చాలా శ్రమించినట్లు చెప్పుకొచ్చింది. దాహం, ఎండ తీవ్రత వల్ల షూటింగ్ అంతా తేలిక కాదు. 5 రోజుల షూట్ తర్వాత చాలా టాన్ అయిపోయాను,” అని తెలిపింది.

Also Read: అమెరికాలో 'కూలీ' ఊచకోత! విడుదలకు ముందే అన్ని కోట్ల వసూళ్లు చేసిన తొలి తమిళ్ సినిమా!

ఇక కూలీ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది. అయితే  హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కలిసి నటించిన 'వార్ 2' సినిమాతో 'కూలీ'కి గట్టి పూర్తి ఉండనుంది. రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, ప్రత్యేక పాత్రలో ఆమిర్ ఖాన్ నటిస్తున్నారు.

‘మొనికా’ పాట రిలీజ్ అయ్యాక ఎంత ట్రెండింగ్ సాంగ్‌గా మారిందో అందరికి తెలిసిందే. అలాంటి ఈ పాట ఇప్పుడు మొనికా బెలూచ్చి వంటి అంతర్జాతీయ స్థాయి నటికి నచ్చడం సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. పూజా హెగ్డే డాన్స్, అనిరుధ్ మ్యూజిక్, లోకేష్ డైరెక్షన్ అన్నీ కలిపి ఈ పాటను సూపర్ హిట్ చేశాయి.

Also Read: కూలీ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

Advertisment
తాజా కథనాలు