సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట నిశ్చితార్థం.. ఫొటోలు వెరీ క్యూట్

'కలర్ ఫొటో' మూవీ డైరెక్టర్ సందీప్ రాజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా నటి చాందినీ రావుతో అతడి ఎంగేజ్ మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. వైజాగ్ లోని ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Sandeep Raj

సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు సాధారణమే. ఇప్పటికే ఎంతో మంది నటీ నటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవడానికి కూడా మరికొంతమంది ఉన్నారు. అయితే ఇప్పుడు మరో ప్రేమ జంట పెళ్లికి సిద్ధమైంది. 'కలర్ ఫొటో' మూవీ డైరెక్టర్ సందీప్ రాజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు. తాజాగా నటి చాందినీ రావుతో అతడి ఎంగేజ్ మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. వైజాగ్ లోని ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

Also Read:  Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌!

సందీప్ సినీ కెరీర్

ఇక సందీప్ సినీ కెరీర్ విషయానికొస్తే.. కెరీర్ మొదట్లో సందీప్ చిన్న చిన్న షార్ట్ ఫిలింస్ చేసేవాడు. అలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత 'కలర్ ఫొటో' సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 

Also Read:  Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!

కనివిని ఎరుగని రీతిలో బాక్సాఫీసును షేక్ చేసింది. అంతేకాకుండా జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. నిర్మాతలకు లాభాల పంట పండించింది. ఈ ఒక్క సినిమా దర్శకుడిగా సందీప్ పేరు మారుమోగిపోయింది. అయితే ఆ తర్వాత సందీప్ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ అలరించాడు. 

Also Read:  Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌!

ప్రస్తుతం సందీప్ రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న 'మోగ్లీ' సినిమాకు కథ అందిస్తున్నాడు. ఇక నటి చాందినీ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈమె కూడా 'కలర్ ఫొటో' సినిమాలో సైడ్ క్యారెక్టర్లో నటించింది. ఆ సమయంలోనే సందీప్-చాందినీల మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత చాందినీ స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఇక వీరి వివాహానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు. ఈ ఏడాది డిసెంబర్ 7న సందీప్- చాందిని వివాహం తిరుపతిలో జరగనుందని తెలుస్తోంది. వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులు రాబోతున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు