Revanth Reddy: బాలకృష్ణకు రేవంత్ సర్కార్ షాక్!

బాలకృష్ణకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. KBR పార్కు రోడ్డు విస్తరణలో ఆయన ఇంటి స్థలం పోనుంది. ఇప్పటికే ఆయన ఇంటికి GHMC అధికారులు మార్కింగ్ వేశారు. ఫిల్మ్‌నగర్‌ రోడ్‌ నంబర్ 45లోని బాలకృష్ణ ఇంటికి 6 అడుగుల మేర మార్కింగ్ వేశారు అధికారులు.

New Update
Bala Krishna: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి బాలకృష్ణ..ఏం మాట్లాడుకున్నారంటే?

Balakrishna: నటుడు బాలకృష్ణకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది.  KBR పార్కు రోడ్డు విస్తరణలో ఆయన ఇంటి స్థలం పోనుంది. ఇప్పటికే ఆయన ఇంటికి GHMC అధికారులు మార్కింగ్ వేశారు. ఫిల్మ్‌నగర్‌ రోడ్‌ నంబర్ 45లోని బాలకృష్ణ ఇంటికి 6 అడుగుల మేర మార్కింగ్ వేశారు అధికారులు. ప్రస్తుతం హైదరాబాద్‌లో KBR పార్కు రోడ్డు విస్తరణ హాట్ టాపిక్‌గా మారింది.  రోడ్డు విస్తరణలో ప్రముఖుల ఇళ్లు ఖతమ్ కానున్నాయి. 

BALAKRISHNA

   బాలకృష్ణ ఇంటి శాటిలైట్ ఇమేజ్

Also Read:కల్తీ లడ్డూ వివాదం.. తిరుమలలో సిట్ అధికారులు!

ప్రభుత్వ నిర్ణయంతో మనస్తాపం..

ఈ విస్తరణలో ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు మాజీమంత్రి జానారెడ్డి, అల్లు అర్జున్ మామ ఇళ్లకు GHMC మార్కింగ్ వేసింది. జానారెడ్డి ఇంటి కాంపౌండ్ కూడా మార్కింగ్ వేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రముఖుల్లో తీవ్ర మనస్తాపం నెలకొంది. కాగా పనుల విషయంలో తగ్గేదేలే అని  రేవంత్ సర్కారు ముందు వెళ్తోంది.  బాధితులందరికీ నచ్చజెప్పి భూసేకరణకు ఒప్పించే యోచనలో ఉంది. కాగా ఇప్పటికే చిన్న పెద్ద అనే బేధం లేకుండా హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటికి బాలకృష్ణ స్పందించలేదు. ఆయన స్పందనపై ఉత్కంఠ కొనసాగుతోంది.

జానారెడ్డి నివాసం

జానారెడ్డి నివాసం శాటిలైట్ ఇమేజ్

Also Read: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!

రోడ్డు విస్తరణకు రూ.150 కోట్లు...

అందిన వివరాల ప్రకారం... మాస్టర్ ప్లాన్‌లో వివరించిన విధంగా రహదారిని విస్తరించడానికి వారి సమ్మతిని అభ్యర్థిస్తూ అధికారులు ఇటీవల నోటీసులు అందించారు. ప్రతిపాదిత విస్తరణకు బాలకృష్ణ ఇంటి స్థలం నుండి 20 అడుగులు అవసరం కాగా, జానా రెడ్డి స్థలం నుంచి 30 అడుగుల అవసరం ఉంది. ఈ స్థలాలు రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి. అయితే వీరు స్థలాన్ని విస్తరణ కొరకు ప్రభుత్వానికి అప్పగిస్తారా లేదా అనేది చూడాలి. అయితే ఇందులో రోడ్ నంబర్ 12, విరించి హాస్పిటల్ సమీపంలోని బంజారాహిల్స్ జంక్షన్.. KBR ద్వారా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌లను కలుపుతూ 6.5 కిలోమీటర్ల విస్తీర్ణంతో రోడ్డు విస్తరణ చేయనుంది. కాగా రోడ్డు విస్తరణ పనులకు జీహెచ్‌ఎంసీ ఇప్పటికే రూ.150 కోట్లు కేటాయించింది.

Also Read: అమెరికాలో భారి యాక్సిడెంట్.. తెనాలి విద్యార్థిని మృతి!

KBR PARK

KBR పార్కు శాటిలైట్ ఇమేజ్

Also Read: YS Sharmila: మరోసారి తన అన్నపై రెచ్చిపోయిన షర్మిల

Advertisment
తాజా కథనాలు