CM Pellam: "సీఎం పెళ్లాం" వచ్చేస్తోంది.

గడ్డం రమణా రెడ్డి దర్శకత్వంలో ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న "సీఎం పెళ్లాం" సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్.కే సినిమాస్ బ్యానర్‌పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలోని ప్రమోషనల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో ఘనంగా రిలీజ్ చేసారు.

New Update
CM Pellam

CM Pellam

CM Pellam: గడ్డం రమణా రెడ్డి డైరెక్షన్లో ఇంద్రజ(Indraja), అజయ్(Ajay), జయసుధ(Jayasudha), సుమన్(Suman)  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ "సీఎం పెళ్లాం" (CM Pellam) విడుదలకు సిద్ధమైంది. ఆర్.కే సినిమాస్ బ్యానర్‌పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. కాగా రీసెంట్ గా "సీఎం పెళ్లాం" సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో ఘనంగా రిలీజ్ చేసారు.

Also Read: 'దొంగ ము** కొడుకు..' వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్‌ షాకింగ్‌ కామెంట్స్‌..! ఫ్యాన్స్ ఫైర్!

ఈ కార్యక్రమంలో, నటి ఇంద్రజ మాట్లాడుతూ, "  సీఎం పెళ్లాం సినిమా అందరిని నవ్విస్తూనే ఒక మంచి సోషల్ మెసేజ్ కూడా అందిస్తుంది.  సమాజానికి ఉపయోగపడే సినిమాగా ప్రేక్షకులని ఎంతగానో ఆలోచింపచేస్తుంది. రియల్ లైఫ్ లో జరిగే యదార్ధ సంఘటనలను దర్శకుడు చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమా కథని నమ్ముకొని తీసాము, ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమాలో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు.

Also Read: రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్.. వార్నర్ ఎంట్రీ అదిరిపోయిందిగా!

అందుకే సినిమాకి "సీఎం పెళ్లాం" అని టైటిల్ పెట్టాం.

అజయ్ మాట్లాడుతూ, "ఈ సాంగ్‌ చూసి నాకు చాలా భావోద్వేగం కలిగింది.  ఈ సినిమాలో నేను సీఎం పాత్రలో నటిస్తున్నాను, నా భార్య పాత్రలో ఇంద్రజ నటించారు. నేను సీఎం పాత్ర చేసినప్పటికీ కథ మొత్తం ఇంద్రజ గారి చుట్టూ తిరుగుతుంది. అందుకే ఈ సినిమాకి "సీఎం పెళ్లాం" అని టైటిల్ పెట్టాం. ఇంత మంచి సినిమాలో నటించడం నాకు చాలా గర్వంగా ఉంది." అని అన్నారు.

Also Read: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!

దర్శకుడు గడ్డం రమణా రెడ్డి మాట్లాడుతూ, "మన నగర పరిస్థితులను ఉద్దేశించి ఈ పాట చిత్రీకరించాం. నేను అమెరికాలో నివసిస్తున్నాను, అక్కడ వర్షం పడినా, చుక్క నీరు కూడా రోడ్లపై నిలవదు. కానీ ఇక్కడ చిన్న వర్షం పడినా నీళ్లు రోడ్లపై నిలిచిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 'ఓకే ఒక్కడు' చిత్రంలో వన్ డే సీఎం పాత్ర మనందరం చూశాం, ఆదరించాం. అలాగే మా సినిమాలో, 'సీఎం పెళ్లాం' బయటకొచ్చి నగర పరిస్థితులను పరిశీలిస్తే ఎలా ఉంటుంది అన్నది చూపిస్తున్నాం. వన్ డే సీఎం కాన్సెప్ట్ తో వచ్చిన ఒకే ఒక్కడు మూవీని ఎంతలాగ ఆదరించారో  మా ఈ "సీఎం పెళ్లాం"ని కూడా అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాం. మా సినిమా సమాజానికి మంచి సందేశం అందిస్తూ, ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది" అని అన్నారు.

నిర్మాత బొల్లా రమకృష్ణ మాట్లాడుతూ, "పొలిటికల్ స్టోరీతో సమాజానికి మంచి సందేశం అందించే సినిమాని రూపొందించాం.  ముఖ్యంగా ఈ సినిమా కథకి నేను చాలా కనెక్ట్ అయ్యాను. అందుకే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయాలనుకున్నాను. అజయ్, ఇంద్రజ తమ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. మా సినిమా మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం. త్వరలోనే  'సీఎం పెళ్లాం'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం." అన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు