Vishal Health: విశాల్ కు అసలేమైంది హెల్త్ బులిటిన్ లో షాకింగ్ విషయాలు!

హీరో విశాల్ ఆరోగ్యం పై చెన్నై ఆస్పత్రి వైద్యులు స్పందించారు. విశాల్ ఫీవర్ తో బాధపడుతున్నారని.. చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని లెటర్ విడుదల చేశారు.

New Update
vishal health update

vishal health update

Hero Vishal Health: ఇటీవలే 'మదగజరాజ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న హీరో విశాల్ వణుకుతూ, సరిగ్గా నడవలేకుండా, మాట్లాడలేని పరిస్థితిలో కనిపించారు. దీంతో ఆయన అభిమానులు విశాల్ ఆరోగ్యం(Vishal Health Issue) పట్ల తీవ్ర ఆందోళన చెందారు. అసలు విశాల్ కి ఏమైంది అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు  విశాల్ ఆరోగ్యంపై స్పందించారు. 

Also Read: HBD AR Rehman: సోదరి కోసం మతం మార్చుకున్న రెహ్మాన్ .. ఈ స్టోరీ మీకు తెలుసా?

విశాల్ కి రెస్ట్ అవసరం.. 

విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు..చికిత్స అందిస్తున్నాము. ప్రస్తుతం విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని హెల్త్ అప్డేట్ పై లెటర్ విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. విశాల్ 12 దాదాపు  ఏళ్ళ క్రితం నటించిన 'మదగజరాజ' చాలా కాలం గ్యాప్ తర్వాత సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. 

Also Read: సినీ ప్రియులకు అదిరిపోయే న్యూస్ .. గ్రాండ్ గా 10వ అజంతా-ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు