10th Ajanta-Ellora International Film Festivel: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 10th అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ఉత్సవానికి సంబంధించిన తేదీలను ప్రకటించారు. ఈ చలన చిత్రోత్సవ వేడుకలు ఛత్రపతి సంభాజీనగర్‌లోని PVR INOX, ప్రోజోన్ మాల్‌లో వేదికగా జనవరి 15 నుంచి 19 వరకు జరగనున్నాయి. పలువురు జాతీయ, అంతర్జాతీయ కళాకారులు ఈ ఉత్వానికి హాజరు కానున్నారు. మరాఠ్వాడా ఆర్ట్, కల్చర్ అండ్ ఫిల్మ్ ఫౌండేషన్ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. వీటితో పాటు భారత ప్రభుత్వ సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, మహారాష్ట్ర ఫిల్మ్, స్టేట్ అండ్ కల్చరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా మద్దతు ఇస్తున్నాయి. ఈ ఉత్సవాన్ని మహారాష్ట్ర సంస్కృతిక వ్యవహారాల మంత్రి ఆషిష్ షెలార్ ప్రారంభిస్తారు.
9 చిత్రాల స్క్రీనింగ్
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు, చిత్ర నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, కళాకారులు తమ ఆలోచనలు పంచుకోవడానికి, చిత్ర నిర్మాణ కళలు, నైపుణ్యాలను అన్వేషించడానికి సరైన వేదికను అందించడమే ఈ చలన చిత్రోత్సవాల ముఖ్య ఉద్దేశం. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో వివిధ భాషలో నుంచి ఎంపికైన 9 బెస్ట్ చిత్రాలు స్క్రీనింగ్ చేయబడతాయి. ఈ సినిమాలను జాతీయ స్థాయి జ్యూరీ సభ్యులు పరిగణిస్తారు. ఇందులో ఉత్తమ చిత్రంగా ఎంపికైన సినిమాకు 'గోల్డెన్ కైలాస్ అవార్డు', ₹1 లక్ష నగదు బహుమతి అందజేయబడతాయి. ఇతర అవార్డులు ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ నటుడు మేల్, ఫీమేల్ విభాగాల్లో ఇవ్వబడతాయి.
భారతీయ సినిమా పోటీల జ్యూరీకి ప్రముఖ నటి సీమా బిస్వాస్ (గౌహతి) అధ్యక్షత వహిస్తారు. అలాగే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ C. K. మురళీధరన్ (ముంబయి), సీనియర్ ఎడిటర్ దీపా భాటియా (ముంబయి), ప్రముఖ దర్శకుడు జో బేబీ (కొచ్చి), ప్రఖ్యాత స్క్రీన్ రైటర్, నటుడు గిరీష్ జోషి (ముంబై) తదితరులు జ్యూరీ ప్యానెల్ సభ్యులుగా ఉన్నారు.
🎬 Ajanta Ellora International Film Festival is Coming!
— Ajanta-Ellora International Film Festival (@aeiffest) January 2, 2025
Save the dates: Jan 15-19, 2025
India Focus Films - Official Announcement
Step into a world of storytelling magic,where culture,creativity, and vision collide on the big screen.
🎟️ Register Today at https://t.co/11rzQ4tosg pic.twitter.com/AvfySDpv73
Also Read: పుష్పగాడి బాక్సాఫీస్ రూల్.. నాలుగు వారాల్లో ఎన్ని కోట్లంటే .. దంగల్ రికార్డు బ్రేక్?