HBD AR Rehman: సోదరి కోసం మతం మార్చుకున్న రెహ్మాన్ .. ఈ స్టోరీ మీకు తెలుసా? భారతీయ సినీ చరిత్రలో ఆస్కార్ అవార్డు అందుకున్న మొట్టమొదటి సంగీత దర్శకుడిగా సత్తా చాటి.. సంగీత ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలిచిన మ్యూజిక్ ఐకాన్ ఏఆర్ రెహ్మాన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.. By Archana 06 Jan 2025 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 1967 జనవరి 6న చెన్నైలో జన్మించిన ఏఆర్ రెహ్మాన్ మూడేళ్ళలోనే తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. సంగీత పట్ల అభిరుచితో చిన్నప్పటి నుంచే తండ్రి RK శేఖర్ వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నాడు. తండ్రి ప్రోత్సాహంతో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతను.. ఇప్పుడు పాటలు రారాజుగా వెలుగొందుతున్నారు. 2/8 ఇండియాస్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు పొందినప్పటికీ.. ఒకప్పుడు రెహ్మాన్ కూడా తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో ఆర్ధిక ఇబ్బందులతో సతమతమయ్యారు. 3/8 చిన్నవయసులోనే రెహ్మాన్ తండ్రిని కోల్పోయారు. అదే సమయంలో అతని సోదరి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారట. ఎన్నో చోట్ల చికిత్స చేయించినప్పటికీ ఆమె ఆరోగ్యం కుదుట పడలేదట. 4/8 అయితే ఆ సమయంలో రెహ్మాన్ తల్లి కూతురి ఆరోగ్యానికి సంబంధించి ఒక ఫకీర్ ని కలిశారట. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం కాస్త కుదుటపడిందట. దీంతో ఫకీర్, దర్గా, ఇస్లాం మీద రెహ్మాన్ విశ్వాసం పెరిగిందని. ఆ తర్వాత మతం మార్చుకున్నారని చెబుతారు. 5/8 రెహ్మాన్ సంగీతం దేశ విదేశాల్లో సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకుంది. "ఆస్కర్", "గ్రామీ" , పద్మ శ్రీ, పద్మ విభూషణ్ వంటి పురస్కారాలు ఆయనను వరించాయి. 6/8 మా తుజే సలామ్, ఛైయ్యా ఛైయ్యా, జయ హో వంటి పాటలు రెహ్మాన్ ప్రతిభను చాటుతాయి. 7/8 2009 లో స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాలో జై హో 'సాంగ్' రెహ్మాన్ కి ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టింది. అంతేకాదు ఈ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా అకాడమీ అవార్డును కూడా అందుకున్నాడు. 8/8 జై హో రెహ్మాన్ స్వరాన్ని అంతర్జాతీయంగా పరిచయం చేసింది. ఆయన పాటలు వినసొంపుగా మాత్రమే కాదు హృదయాలను తాకేలా ఉంటాయి. #telugu-cinema-news #cinema #latest-news #tollywood-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి