Chiranjeevi: డైరెక్టర్ బాబీ చిరంజీవికి వీరాభిమాని అని అందరికీ తెలిసిందే. బాబీ కూడా ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే తాజాగా మెగాస్టార్ బాబీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. సుమారు 6- 10 లక్షల పైగా విలువ చేసే ఒమేగా సీమాస్టర్ వాచ్ ని గిఫ్ట్ గా అందించారు. మెగాస్టార్ స్వయంగా బాబీ చేతికి ఈ వాచ్ ని తొడిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బాబీ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. '' బాస్ స్వయంగా ఇచ్చిన మెగా సర్ప్రైజ్.. ప్రియమైన మెగాస్టార్ కి ధన్యవాదాలు. ఈ అమూల్యమైన బహుమతి మర్చిపోలేనిది. మీ ప్రేమ, ప్రోత్సాహం మరియు ఆశీర్వాదాలు నాకు ప్రపంచం అన్నయ! నేను ఈ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను'' అని పోస్ట్ పెట్టారు.
Also Read: #AA22xA6: వామ్మో.! ఒక్క హీరో కోసం ముగ్గురు స్టార్ హీరోయిన్లు.. అట్లీ ప్రాజెక్ట్ పై పెరుగుతున్న అంచనాలు
/rtv/media/media_files/2025/05/23/kiTGpnfn2RR7f8RVxZiR.jpg)
వాల్తేరు వీరయ్య
మెగాస్టార్- బాబీ కాంబోలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో మెగాస్టార్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి. చిరంజీవి ఎనర్జీ, స్క్రీన్ ప్రజెన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విజయం పట్ల ఆనందంగా స్పందించిన మెగాస్టార్.. బాబీ పని పట్ల ప్రేమ, ప్రశంసలకు గుర్తుగా
ఈ బహుమతిని ఇచ్చినట్లు తెలుస్తోంది.
latest-news | cinema-news | director-bobby
Also Read: RGV: మరో వివాదంలో RGV.. కియారా బికినీ లుక్ పై వల్గర్ పోస్ట్! తిట్టిపోస్తున్న నెటిజన్లు