/rtv/media/media_files/2025/05/25/5mEQgiC70vBMHQxVZ7Ll.jpg)
Bunny vasu
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీపైన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న కూడా సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా అని పవన్ ప్రశ్నించారు. సినీ పెద్దలు, అగ్ర నటులను గత ప్రభుత్వం ఎలా చూసిందో మర్చిపోయారా అని పవన్ గుర్తుచేశారు. పవన్ వ్యాఖ్యలపై బన్నీ వాసు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ
అండర్‌స్టాండింగ్ లేదని..
సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా లోతుగా ఉన్నాయి. రాజకీయాల్లో గొడవల వల్ల సినీ పరిశ్రమ నలిగిపోతుందని ఇప్పటికైనా అందరూ గ్రహించాలన్నారు. సినీ పరిశ్రమ నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం అయిన వారినే ఇబ్బంది పెట్టామంటే.. మన మధ్య ఎంత అండర్‌స్టాండింగ్ ఉందో తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా ఉంటాయి.. అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే.. ప్రొడ్యూసర్స్ గానీ.. డిస్ట్రిబ్యూటర్స్ కానీ.. ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం…
— Bunny Vas (@TheBunnyVas) May 24, 2025
ఇది కూడా చూడండి: PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!
ఇదిలా ఉండగా తమ ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా అని పవన్ ప్రశ్నించారు. సినీపెద్దలు, అగ్రనటులను గత ప్రభుత్వం ఎలా చూసిందో మర్చిపోయారా అని పవన్ గుర్తుచేశారు. గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరచిపోయినట్లున్నారని అన్నారు. ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవన్న పవన్.. సినిమా సంఘాల ప్రతినిధులే రావాలన్నారు. తమ ప్రభుత్వం వ్యక్తులను కాదు.. సినీరంగం అభివృద్ధినే చూస్తుందని తెలిపారు.
ఇది కూడా చూడండి: Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?
తెలుగు సినిమా ఇండస్ట్రీ తీరుపై పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ఆయన నటించిన హరి హర వీరమల్లు రిలీజ్ దగ్గరపడుతున్న వేళ నిర్మాతలతో ఇబ్బందుల వల్ల థియేటర్లు మూసేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. పరిశ్రమ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుంటే కనీసం కృతజ్ఞత చూపడం లేదంటూ ఫైరయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది. అదే విధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకువస్తామని పవన్ వెల్లడించారు. దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని తెలిపారు. అనంతరం కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారు.