Bobby Deol: బాబీ డియోల్ కొత్త కారు.. రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ఎడిషన్ టూ.. ఎన్ని కోట్లంటే !

బాబీ డియోల్ కొత్త కారును కొనుగోలు చేశారు. రూ. 2.95 కోట్లకు పైగా విలువ చేసే బ్రాండ్ న్యూ రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ఎడిషన్ టూను ఇంటికి తీసుకువచ్చారు. ఇప్పటికే బాబీ డియోల్ తో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ మోడల్ ఉంది. బాబీ డియోల్ కొత్త కారు ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

New Update
Bobby Deol's new Range Rover

Bobby Deol's new Range Rover

Bobby Deol:  బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ యానిమల్ సినిమాతో మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చారు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస అవకాశాలతో బిజీ అయిపోయారు. అయితే తాజాగా ఈ నటుడు తన గ్యారేజ్ కి మరో బ్రాండ్ న్యూ కారును యాడ్ చేశారు. ఇప్పటికే ఆయన దగ్గర ఉన్న రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కంటే విలువలైన, ప్రత్యేకమైన వాహనాన్ని కొనుగోలు చేశారు. 2.95 కోట్లకు పైగా విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ఎడిషన్ టూను ఇంటికి తీసుకువచ్చారు. మార్కెట్లో మొదటి ఎడిషన్ విజయవంతం అయిన తర్వాత బ్రాండ్ దీనిని ప్రారంభించింది. 

Also Read: Sunny Deol: చర్చిలో రక్తపాతం.. స్టార్ హీరోపై క్రైస్తవ సంఘాలు ఆగ్రహం.. సినిమా బ్యాన్!?

Also Read: Milk Adulteration: మీరు తాగే పాలు కల్తీ చేయనివేనా?: ఈ సింపుల్ చిట్కాతో ఇంట్లోనే కనిపెట్టండిలా!

ప్రత్యేకమైన ఫీచర్స్ 

రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ఎడిషన్ టూలో 4.4-లీటర్ ట్విన్-టర్బో మైల్డ్-హైబ్రిడ్ V8 ఇంజిన్ కలిగి ఉంటుంది. 626 hp,  800 Nm టార్క్‌ను అందిస్తుంది. దీనిలోని 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్,  ఆల్-వీల్ డ్రైవ్‌ ఫీచర్స్ తో  3.8 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు దూసుకుపోతుంది. దీని గరిష్ట వేగం 290 kmph కి పరిమితం చేయబడింది.  'రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ఎడిషన్ 2' లో .. బ్లూ నెబ్యులా మాట్టే, లిగురియన్ బ్లాక్ గ్లోస్, మార్ల్ గ్రే గ్లోస్ మరియు సన్‌రైజ్ కాపర్ శాటిన్ వంటి ప్రత్యేకమైన  ఫినిషెష్( రంగులు) అందుబాటులో ఉన్నాయి. వీటిలో బాబీ డియోల్ అద్భుతమైన బ్లూ నెబ్యులా వేరియంట్‌ను  ఎంచుకున్నారు.

latest-news | cinema-news bobby-deol

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు