/rtv/media/media_files/2025/04/12/8y8Rkwegaqrtmb4ebrjQ.jpg)
milk
Milk Adulteration: ప్రతి రోజు ఉపయోగించే నిత్యావసర సరుకుల్లో పాలు చాలా ముఖ్యమైనవి. ఉదయం నిద్రలేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక విధంగా పాలను వినియోగిస్తూనే ఉంటారు. ఉదయాన్నే టీ తాగడానికి, పిల్లలకు పట్టించడానికి, ఏదైనా స్వీట్లు తయారు చేసుకోవడానికి ఇలా రకరకాలుగా పాలను ఉపయోగిస్తారు. ఇలా ప్రతీ రోజు మీరు తాగే పాలు స్వచ్ఛమైనవా ? కాదా? అని ఎప్పుడైనా ఆలోచించారా?.
అసలే ఈ మధ్య మార్కెట్లో కల్తీ అమ్మకాలు బాగా పెరిగిపోయాయి. నీరు, స్టార్చ్, డిటర్జెంట్, యూరియా, సింథటిక్ వంటి వాటితో పాలను కల్తీ చేస్తున్నారు. ఇవి పాలలోని పోషకాలను నాశనం చేయడమే కాకుండా ఆరోగ్యానికి హానీ కలిగిస్తాయి. ముఖ్యంగా గర్భిణీలు, పిల్లలకు, ఇలాంటి కల్తీ పాలు మరింత ప్రమాదకరం. ఇటువంటి పరిస్థితుల్లో మీ ఇంటికి వచ్చే పాలు స్వచ్ఛమైనవేనా? అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే దీని గురించి మీరు పెద్దగా చింతిచాల్సిన అవసరం లేదు. కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా పాలల్లో కల్తీని గుర్తించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
కల్తీ పాలను ఎలా గుర్తించాలి?
అయోడిన్ పరీక్ష
స్టార్చ్ తో కల్తీ అయిన పాలను గుర్తించడానికి అయోడిన్ పరీక్ష చేయవచ్చు. దీని కోసం పాలలో కొన్ని చుక్కల అయోడిన్ కలపండి. ఆ తర్వాత పాలు నీలి రంగులోకి మారితే పాలు పిండి పదార్థాలతో కల్తీ అయినట్లు సంకేతం.
ఫోమ్ పరీక్ష
ఫోన్ పరీక్ష చేయడానికి పాలను సీసాలో పోసి, ఆపై దానిని గట్టిగా షేక్ చేయండి. అప్పుడు నురుగు అధికంగా ఏర్పడితే.. అవి సింథటిక్ పాలు అని అర్థం.
ఉపరితలం ద్వారా
ఎటువంటి రసాయనాలు, పరీక్షలు లేకుండా పాలలో కల్తీని గుర్తించవచ్చు. ఒక స్టీల్ ప్లేట్ లేదా గాజు ముక్క తీసుకొని దాని మృదువైన ఉపరితలంపై పాల చుక్కలు వేయండి. చుక్కలు నెమ్మదిగా ప్రవహిస్తూ మందపాటి తెల్లని గీతను వదిలేస్తే స్వచ్ఛమైన పాలని అర్థం. ఎటువంటి గీత ఏర్పడకపోతే అవి నీటితో కల్తీ అయ్యాయని సంకేతం.
telugu-news | latest-news | health | milk-adulteration | milk-adulteration-tests