Bigg boss telugu 9: బిగ్ బాస్ బజ్ హోస్ట్‌గా మంగపతి.. ఎలిమినేట్ కంటెస్టెంట్స్‌కి చుక్కలే!

గత సీజన్‌లో బిగ్ బాస్ బజ్‌కి హోస్ట్‌గా అర్జున్ నిర్వహించగా ఈ సారి శివాజీ హోస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. హౌస్‌లో ఉన్నప్పుడు శివాజీ ముక్కు సూటిగా మాట్లాడేవారు. హోస్ట్‌గా కూడా ఇలా వ్యవహరిస్తే ఎలిమినేట్ కంటెస్టెంట్లకు చుక్కలే అని నెటిజన్లు అంటున్నారు. 

New Update
Shivaji

Shivaji

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ గ్రాండ్‌గా లాంఛ్ కానుంది. ఈ సారి మొత్తం 14 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లబోతున్నారు. వీరిలో సెలబ్రిటీలు, కామనర్స్ కూడా ఉన్నారు. అయితే ఈ సారి కొందరు కంటెస్టెంట్లు అదిరిపోయే డ్యాన్స్ ఫెర్మామెన్స్‌లతో హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హౌస్‌లోకి శ్రష్టి వర్మ, తనూజా గౌడ, ఆషా సైనీ, ఇమ్మాన్యయెల్, సంజానా గాల్రానీ, భరణి, రాము రాథోడ్, రీతూ చౌదరి, అలేఖ్య చిట్టి పికిల్స్ గర్ల్ రమ్య, దీపికా, దేబ్జానీ, శివకుమార్, తేజస్విని గౌడ, శ్రీతేజ, సుమన్ శెట్టి రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: BIGG BOSS 9 Telugu: బిగ్ బాస్ లోకి దువ్వాడ జంట... చివర్లో బిగ్ ట్విస్ట్!

ఇది కూడా చూడండి: Dhoni The Chase Teaser: M.S ధోని ఊరమాస్ టీజర్.. యాక్టింగ్ గూస్‌బంప్స్

మంగపతి బిగ్ బాస్ హోస్ట్‌గా..

అలాగే కామనర్స్ నుంచి ఐదుగురు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. మాస్క్ మ్యాన్ హరీష్, దమ్ము శ్రీజ, ఆర్మీ పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, మనీష్ ప్రియా వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ బజ్ హోస్ట్ విషయానికి వస్తే ఈసారి మంగపతి వెళ్లబోతున్నట్లు సమాచారం. గత సీజన్‌లో అర్జున్ బిగ్ బాస్ బజ్‌కి హోస్ట్‌గా నిర్వహించగా ఈ సారి శివాజీ హోస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. హౌస్‌లో ఉన్నప్పుడు శివాజీ ముక్కు సూటిగా మాట్లాడేవారు. హోస్ట్‌గా కూడా ఇలా వ్యవహరిస్తే ఎలిమినేట్ కంటెస్టెంట్లకు చుక్కలే అని నెటిజన్లు అంటున్నారు. 

ఇదిలా ఉండగా ఇటీవల బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్‌గా లాంఛ్ కానున్నట్లు ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రొమో అయితే అదిరిపోయింది. ఈసారి ఒక హౌస్ కాదు.. రెండు హౌస్‌లు.. రణరంగమే అంటూ నాగార్జున్ అదరగొట్టారు. ఎప్పటిలాగానే స్టైలిష్‌గా నాగార్జున కనిపించాడు. అయితే ఈ  ప్రోమోలో కామనర్స్ కనిపించారు. వీరిలో ఐదుగురు మాత్రమే హౌస్‌లోకి వెళ్లబోతున్నారు. 

Advertisment
తాజా కథనాలు