ఎన్టీఆర్- హృతిక్ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ రచ్చ.. ఎవరో తెలుసా?

ఎన్టీఆర్- హృతిక్ రోషన్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'వార్ 2'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ మూవీ స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్, హృతిక్ తో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ స్టెప్పులేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

New Update
war 2 update

war 2 special song Shraddha Kapoor

Shraddha Kapoor:  టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్  చిత్రం 'వార్2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తారక్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో తెలుగులో కూడా ఈ మూవీకి భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇటీవలే ఎన్టీఆర్ కూడా షూట్ లో జాయిన్ అయ్యారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: నేను ఇలాగే మాట్లాడతా, ఎవ్వరూ ఏం పీకలేరు.. వాళ్లపై విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్

వార్ 2 స్పెషల్ సాంగ్ లో శ్రద్ధ కపూర్ 

ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. వార్ 2 స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్, హృతిక్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ స్టెప్పులేయనున్నట్లు బీ టౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవలే పుష్ప2 స్పెషల్ సాంగ్ శ్రద్ధాను అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ చర్చలు విఫలమయ్యాయి. ఫైనల్ గా  శ్రీలీల ఎంపికైంది. ఈ క్రమంలో వార్ 2 లో శ్రద్ధ స్పెషల్ సాంగ్ అనే వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.  అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Also Read: నవ్వులు పూయిస్తున్న 'సారంగపాణి జాతకం' టీజర్‌.. ప్రియదర్శి కామెడీ టైమింగ్ అదుర్స్

ఇటీవలే వార్ 2 సెట్స్ నుంచి లీకైన ఎన్టీఆర్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. లీకైన ఫొటోల్లో తారక్ లుక్ అదిరిపోయింది. ఫొటోలో ఎన్టీఆర్ ఆర్మీ షర్ట్ ధరించి ఉండడంతో సినిమాలో తారక్  ఆర్మీ ఆఫీసర్ రోల్ చేస్తున్నట్లు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇందులో ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లు టాక్. 

 

Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు