పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్

బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా పెళ్లి పీటలు ఎక్కబోతుంది. నవంబర్ 21 ప్రియుడు యష్ ని నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

New Update
bigg boss soniya

bigg boss soniya engagement

Bigg Boss Soniya :బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టిన సోనియా ఫుల్ నెగిటివిటీతో బయటకు వచ్చింది. హౌస్ లో పృథ్వీ , నిఖిల్ ట్రాక్ సోనియాకు నెగిటివిటీ తీసుకొచ్చింది. షో స్టార్టింగ్ లో ఏదైనా ఆర్గుమెంట్ వస్తే.. లా పాయింట్ మాట్లాడుతూ అల్లాడించేది. కానీ బయట వచ్చిన నెగిటివిటీ కారణంగా ఊహించని విధంగా 4వ వారమే ఎలిమినేట్ అయ్యింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన సోనియా పెళ్ళికి రెడీ అయ్యింది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. 

Also Read: 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటిరా? ఇంటర్నేషనల్.. పుష్ప2 ట్రైలర్ అరాచకం..!

Also Read: మహారాష్ట్రలో షిండే సక్సెస్ కు 5 ప్రధాన కారణాలివే!

ప్రియుడితో సోనియా నిశ్చితార్థం.. 

నవంబర్ 21 సోనియా తన ప్రియుడి యష్ వీరగోగినేని ని ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయాన్ని సోనియా స్వయంగా చెప్పకపోవడంతో.. నిజమేనా..? లేదా ఫేకా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వీరి పెళ్లి డిసెంబర్ లో కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో సోనియా, యష్ వివాహం జరగనుందట. ఇది ఇలా ఉంటే యష్ కి ఆల్రెడీ పెళ్లయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ పలు కారణాల చేత మొదటి భార్యతో విడిపోయాడు. ఆ తర్వాత సోనియాను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సోనియానే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

Also read: మహారాష్ట్రలో సీఎం పోరు.. షిండే VS ఫడ్నవీస్

Advertisment
తాజా కథనాలు