Bigg Boss Season 9: బిగ్ బాస్ సీజన్ 9లోకి అలేఖ్య చిట్టి పికిల్స్.. ఇక రణ రంగమే!

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రొమోను స్టార్ మా ఇటీవల విడుదల చేసింది. అయితే ఈ సీజన్‌లోకి అమర్‌దీప్ భార్య తేజస్విని గౌడ, సీరియల్ నటి డేబ్జానీ, ఇమ్యానుయేల్, యూట్యూబర్ అలేఖ్య చిట్టి, నటి కల్పిక గణేష్, సీరియల్ ఫేమ్ దీపిక అని తెలుస్తోంది.

New Update

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రొమోను స్టార్ మా ఇటీవల విడుదల చేసింది. అయితే ‘‘ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే’’ అంటూ ఓ పవర్ ఫుల్ వీడియో రిలీజ్ చేసింది. ఈ తొమ్మిదవ సీజన్‌కు కూడా నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు. అయితే ఈ సీజన్‌లో బిగ్ బాస్‌కు వచ్చే కంటెస్టెంట్లు ఎవరనే తెలుసుకోవాలని బిగ్ బాస్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్‌లో బిగ్ బాస్‌కి ఎంట్రీ ఇచ్చేవారి పేర్లు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. 

ఇది కూడా చూడండి: Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్‌ మస్క్‌ కీలక సూచన

కంటెస్టెంట్లు వీళ్లే..

ఈ సీజన్‌లోకి బమ్ చిక్ బబ్లూ, యూట్యూబర్ అలేఖ్య చిట్టి ( చిట్టి పీకిల్స్), పబ్ వివాదంతో పాపులర్ అయిన నటి కల్పిక గణేష్, సీనియర్ యాక్టర్ సాయి కిరణ్, నటి జ్యోతి రాయ్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. రీతు చౌదరి, నటి ప్రియాంక జైన్ ప్రియుడు శివకుమార్, విలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన అనిల్ జీల, సీరియల్ నటి కావ్య, ప్రదీప్, బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపిక, ఆర్టిస్ట్ నవ్య స్వామి, యూట్యూబర్ శ్రావణి వర్మ, జబర్దస్త్ కమెడియన్ ఇమ్యానుయేల్, అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ, సీరియల్ నటి డేబ్జాని, కేరింత సినిమా హీరో సుమంత్ అశ్విన్, సీరియల్ నటులు హారిక ఏక్‌నాథ్‌లు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే వీటిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Fruits and Milk: ఈ పండ్లు పాలు తాగితే శరీరంలో విషంగా మారుతుందా..? ఇలా జాగ్రత్తలు తీసుకోండి..!!

ఇది కూడా చూడండి: Kannappa: 'కన్నప్ప' లో ఆ సీన్ సినిమాకే హైలైట్.. మంచు విష్ణు నటనకు కన్నీళ్లు ఆగవు!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు