/rtv/media/media_files/2024/12/21/YpxR8I83WbokjAdgBRQk.jpg)
sonia marriage Photograph: (sonia marriage)
బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా ఆకుల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. యష్ అనే వ్యక్తితో కొత్త జీవితం ప్రారంభించింది. శుక్రవారం రాత్రి జరిగిన వీరి మ్యారేజ్‌కు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్‌లతో పాటు గత సీజన్ కంటెస్టెంట్స్ సైతం హాజరయ్యారు. నవంబర్ 21న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
Also Read: Ap: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా మద్యం ధరలు తగ్గింపు
సోనియాది తెలంగాణలోని మంథని. ఆమె తన కెరీర్ మొదట్లో యాంకర్ చేసింది. ఆ తర్వాత నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆర్జీవీ తీసిన ఒకటి రెండు సినిమాల్లో నటించి పేరు సంపాదించుకుంది. అలా ఇటీవల బిగ్ బాస్ 8లోకి అడుగుపెట్టింది.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..10 మందికి తీవ్రగాయాలు
ఇక ‘బిగ్ బాస్’ సీజన్ 8 రియాల్టీ షో ఇటీవల ముగిసింది. ఈ సీజన్‌లో నిఖిల్ విన్నర్‌గా కాగా.. రన్నరప్‌లో గౌతమ్ నిలిచాడు. ఇక ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి అందరిలోనూ ఆసక్తి మొదలైంది. అయితే ఈ షోలో తెలిసిన ముఖాలేవి లేకపోవడంతో బిగ్ బాస్ ప్రియులు మొదట్లో అంతగా ఆసక్తి కనబరచలేదు.
Also Read: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఈ జిల్లాలలో భారీ వానలు!
ఒక్క విష్ణు ప్రియ తప్ప ఇంకెవరివీ అంతగా తెలిసిన ముఖాలు లేవు. దీంతో అంతా నిరాశ చెందారు. కానీ రోజులు గడుస్తున్న కొద్ది బిగ్ బాస్ హౌస్‌లో ఉండే వారి ఆటతీరు, మాటతీరు బట్టి ఫ్యాన్స్ అయిపోయారు. దీంతో ఒక్కో కంటెస్టెంట్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది.
బిగ్ బాస్ 8లో సోనియాపై ట్రోలింగ్స్
ఇక ఈ సీజన్ 8లో బాగా ట్రోలింగ్‌కు గురైంది ఎవరన్నా ఉన్నారు అంటే అది సోనియా ఆకుల అనే చెప్పాలి. షో మొదలైనప్పటి నుంచి ఒక పక్క నిఖిల్ మరోపక్క పృథ్వీతో కలిసి ఉండటంతో అందరూ ఆమెను ట్రోలింగ్ చేశారు. నిఖిల్, పృథ్వీలను తన మాటలతో మాయ చేస్తుందని చాలా మంది విమర్శలు చేశారు. అలా ఎన్నో విమర్శలు, ట్రోలింగ్స్ ఎదుర్కొన్న తర్వాత ఆమె ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. అనంతరం తన ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది.