హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా' టీజర్ విడుదల చేశారు మేకర్స్. టీజర్ లో రామ్ ఎనర్జీ, మాస్ డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. ఇందులో రామ్ 'ఆంధ్ర కింగ్' ఉపేంద్ర వీరాభిమానిగా కనిపించారు. ఒక అభిమానికి తన హీరో అంటే ఎంత పిచ్చి.. అతడి కోసం ఏం చేయడానికైనా ఎలా సిద్దపడతాడు అనే కథాంశాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక టీజర్ చివరిలో నటుడు మురళి శర్మ చెప్పే డైలాగ్ అరాచకం అంతే! ఈ జనరేషన్ యుతకు ఇది బాగా కనెక్ట్ అవుతుందని అనిపించింది. "ఫ్యాన్... ఫ్యాన్ అని గుడ్డలు చింపేసుకోవడమే కానీ... నువ్వు ఒకడివి ఉన్నావని కూడా మీ హీరోకి తెలియదు. ఏం బతుకులుగా మీవీ... ఛీ ఛీ" అనే డైలాగ్ టీజర్‌కు హైలైట్‌గా ఉంది. అలాగే రామ్ చెప్పే మాస్ డైలాగ్స్, ఎమోషన్స్ ఆకట్టుకున్నాయి. రామ్, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఈ చిత్రంలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Life is all Fun & Games Until……it hits you with a question that questions your very existence.#AKTTeaser out now!
— RAm POthineni (@ramsayz) October 12, 2025
▶️ https://t.co/c8ciz5yJw2#AndhraKingTalukapic.twitter.com/k8sJZPRgOD