Chiranjeevi Deepfake Video: చిరంజీవి AI డీప్‌ఫేక్ న్యూడ్ వీడియో క్రియేట్.. కేసు నమోదు!

తన ఫొటోలను మార్ఫింగ్ చేసి AI ద్వారా అశ్లీల డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడంపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్న ఈ వీడియోలపై HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

New Update
Chiranjeevi Deepfake Video

Chiranjeevi Deepfake Video

ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అదే క్రమయంలో టెక్నాలజీ ఉపయోగం కంటే దుర్వినియోగం ఎక్కువగా జరుగుతోంది. ఇది ముఖ్యంగా సెలబ్రెటీలకు పెద్ద తలనొప్పిగా మారింది. అందులో ఎక్కువ డీప్‌ఫేక్ టెక్నాలజీ వల్ల సెలబ్రెటీల పేరు, ప్రతిష్టకు ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ వల్ల ఎంతో మంది సెలబ్రెటీల మనోభావాలు దెబ్బతిన్నాయి.

Chiranjeevi Deepfake Video 

ఇటీవల బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రష్మిక మందన్నా, రజినీ కాంత్ వంటి ఎంతో మంది సినీ ప్రముఖులు ఇలాంటి డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ వీడియోల బారిన పడి పోలీసులను ఆశ్రయించారు.  

కొందరు దుండగులు ఏఐని ఉపయోగించి చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి.. దాని ద్వారా అశ్లీల వీడియోలను క్రియేట్ చేశారు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్, ఇతర వెబ్ సైట్లలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. ఈ విషయం చిరంజీవి దృష్టికి రావడంతో ఆయన సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. వెంటనే న్యాయపోరాటం మొదలు పెట్టారు. 

మొదటగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను కలిశారు. ఆయనకు జరిగిన విషయం తెలిపి అధికారికంగా ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా ఆ తర్వాత హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా కొందరు వ్యక్తిగత, వాణిజ్య లాభాల కోసం తన పేరు, వాయిస్, ఫోటో, ‘మెగాస్టార్’, ‘చిరు’ వంటి పేర్లను వాడుకుంటున్నారని తెలిపారు. ఇలా దాదాపు 30కి పైగా యూట్యూబ్ ఛానెళ్లు, ఆన్‌లైన్ సంస్థలు, డిజిటల్ మీడియా వంటివి ఉన్నాయని.. ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

చిరంజీవి పిటిషన్‌ను విచారించిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అతని అనుమతి లేకుండా చిరంజీవి ఫోటో, వాయిస్, పేరు లేదా ఆయనకు సంబంధించి మరే వ్యక్తిగత గుర్తింపులను వాడకూడదని కోర్టు స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా వాయిస్ క్లోనింగ్‌, డీప్ ఫేక్ ఏఐ ద్వారా దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం.. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisment
తాజా కథనాలు