Bigg Boss 9 Telugu: హౌస్‌లో రెచ్చిపోతున్న డిమోన్ పవన్, రీతూ.. వీళ్ల రొమాన్స్ చూడలేకపోతున్నామంటూ మండిపడుతున్న నెటిజన్లు!

డిమోన్ పవన్‌కు కెప్టెన్సీ టాస్క్‌లో రీతూ సపోర్ట్ చేయడం వల్ల ఆమెను నామినేట్ చేశారు. అయితే డిమోన్‌కు స్పెషల్ పవర్ వచ్చినప్పుడు ఆమెను కాకుండా శ్రీజను సేవ్ చేశారు. దీంతో రీతూ హర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ క్లోజ్‌గా ఉన్నారు.

New Update
Demon Pavan Rithu Chowdary

Demon Pavan Rithu Chowdary

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం సాఫీగా సాగుతోంది. ఈ సారి సీజన్ రణరంగమే అని నాగార్జున చెప్పినట్లు లేదు. అయితే ఈ వారం నామినేషన్స్‌లో రీతూ చౌదరి, ప్రియా శెట్టి, ఆర్మీ పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్ హరీష్, రాము రాథోడ్ ఉన్నారు. ఈ వారం శ్రీజ కూడా నామినేట్ అయ్యింది. కాకపోతే కెప్టెన్ డిమోన్ పవన్ స్పెషల్ పవర్ వల్ల ఆమె ఈ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యింది. నిజానికి రీతూ చౌదరి డిమోన్ పవన్ వల్ల నామినేషన్‌లోకి వెళ్లింది. కెప్టెన్సీ టాస్క్‌లో అతనికి అనుకూలంగా సపోర్ట్ చేయడంతో ఆమెను నామినేట్ చేశారు. సంచాలక్‌గా ఆమె ఫెయిల్ అయ్యారని, ఫేవరిజం చూపించారని అన్నారు. అయితే డిమోన్ పవన్ వల్ల రీతూ నామినేషన్స్‌లోకి వెళ్లిన ఆమెను సేవ్ చేయకుండా శ్రీజను సేవ్ చేశాడు. దీంతో రీతూ చౌదరి ఎమోషనల్ అయ్యింది.

ఇది కూడా  చూడండి: Thaman OG: ఇది కదా మాస్ అంటే.. కొణిదెల తమన్ అస్సలు తగ్గడం లేదుగా..!

తనని సేవ్ చేయలేదని..

తన హార్ట్ బ్రేక్ అయ్యిందని రీతూ అన్నది. అయితే నువ్వు స్ట్రాంగ్ నామినేషన్స్ నుంచి వస్తావని డిమోన్ అన్నాడు. ఆ తర్వాత డిమోన్ పవన్ ఈ వారం హౌస్ నుంచి ఎవరు వెళ్తారని అంటే.. రితూ చౌదరి నేనే వెళ్తానని అంది. ఈ సమయంలో లేదు నువ్వు వెళ్లవంటూ ఇద్దరూ హగ్ చేసుకుని జోకులు వేసుకుంటున్నారు. ఆ తర్వాత రీతూ చౌదరికి తినిపిస్తున్నాడు. వీళ్లు  రొమాన్స్ చూడలేకపోతున్నామంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. కేవలం షో కోసం ఇలా నటిస్తున్నారా.. లేకపోతే నిజంగానే ఎమోషన్స్ ఉన్నాయా? అనే సందేహంలో నెటిజన్లు ఉన్నారు. వీళ్లు క్లోజ్‌గా ఉంటారని కొందరు రిలేషన్ ఉందని అనుకుంటున్నారు. హౌస్ మేట్స్ కూడా అడిగితే వీరిద్దరి మధ్య ఏం లేదని కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉందని పలుమార్లు తెలిపారు. కానీ వీరి ప్రవర్తన మాత్రమ ఫ్రెండ్‌షిప్ లెక్క లేదని తెలుస్తోంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

ఇది కూడా  చూడండి: Weekend OTT List: వీకెండ్ స్పెషల్.. ఓటీటీ మూవీస్ లిస్ట్ ఇదే..!

Advertisment
తాజా కథనాలు