Weekend OTT List: వీకెండ్ స్పెషల్.. ఓటీటీ మూవీస్ లిస్ట్ ఇదే..!

ఈ వారం ఓటీటీలో ‘కన్నప్ప’ హిందీ వెర్షన్‌తో, ‘హృదయపూర్వం’, ‘సుందరకాండ’, ‘ఫారెవర్’, ‘ఒడమ్ కుతిరా’, ‘బ్రింగ్ హెర్ బ్యాక్’, ‘జనావర్’ సినిమాలు, సిరీస్‌లు విడుదలవుతున్నాయి. జియో హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ETV Win వేదికగా స్ట్రీమింగ్‌ కానున్నాయి.

New Update
Weekend OTT List

Weekend OTT List

Weekend OTT List: ఈ వారం ఓటీటీలో ప్రేక్షకుల కోసం ఎన్నో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. హిందీ ‘కన్నప్ప’ నుండి మోహన్‌లాల్ ‘హృదయపూర్వం’ వరకు అనేక మూవీస్ అందుబాటులోకి రానున్నాయి. ఈ వారం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతున్న ముఖ్య కంటెంట్‌పై ఓ లుక్కేయండి.

ఫారెవర్ (Forever)

ETV Win‌లో కథా సుధ సిరీస్‌లో భాగంగా విడుదలైన చిన్న చిత్రం. పరుచూరి వేణు, అభిరామ్ ముఖ్య పాత్రల్లో నటించగా, ఆర్. విశ్వనాథన్ దర్శకత్వం వహించారు.

సుందరకాండ

నారా రోహిత్ హీరోగా, వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

కన్నప్ప

మనకు తెలిసిన తిన్నడు కథ ఆధారంగా మంచు విష్ణు తెరకెక్కించిన ఈ భక్తిరస చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవలే హిందీ వెర్షన్ కూడా విడుదలయ్యింది.

హృదయపూర్వం

మోహన్‌లాల్ నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 26న జియో హాట్‌స్టార్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. తెలుగు డబ్ వెర్షన్ కూడా ప్రకటించారు.

ఒడమ్ కుతిరా చడం కుతిరా

ఫహాద్ ఫాసిల్, కళ్యాణీ ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రం థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయినా, సెప్టెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతుంది. తెలుగు డబ్ వెర్షన్ కూడా ఉంటుంది.

బ్రింగ్ హెర్ బ్యాక్

ఇంగ్లీష్ థ్రిల్లర్ "బ్రింగ్ హెర్ బ్యాక్" ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రూ.249 రెంటల్‌తో స్ట్రీమింగ్‌కి వచ్చింది. హిందీ వెర్షన్ ఉంది కానీ తెలుగు డబ్ లేదు.

జనావర్

భువన్ అరోరా నటించిన ఈ హిందీ క్రైమ్ మిస్టరీ సిరీస్ ZEE5లో సెప్టెంబర్ 26న విడుదలవుతుంది. తెలుగు వెర్షన్‌పై ఇంకా స్పష్టత లేదు.

ఇంకా శ్రీలీల ‘జూనియర్’, అనుష్క ‘ఘాటి’ వంటి చిత్రాలు కూడా సర్‌ప్రైజ్‌గా రానున్నాయి. తాజా ఓటీటీ అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.

Advertisment
తాజా కథనాలు