Bigg Boss 9 Telugu Buzz: ''జుట్టు పట్టుకుని ఈడ్చి కొడతా''.. బజ్ షోలో  శివాజీ- మాధురి ఫుల్ ఫైర్ !

వైల్డ్ కార్డు ఎంట్రీగా బిగ్ బాస్ సీజన్ 9 అడుగుపెట్టిన దివ్వెల మాధురి ఉన్న మూడు వారాలు హౌజ్ ను అల్లాడించింది. వచ్చిన మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లతో గొడవలు, ఆర్గుమెంట్స్ రచ్చ రచ్చ చేసింది.

New Update
bigg boss buzz

bigg boss buzz

Bigg Boss 9 Telugu Buzz: వైల్డ్ కార్డు ఎంట్రీగా బిగ్ బాస్ సీజన్ 9 అడుగుపెట్టిన దివ్వెల మాధురి ఉన్న మూడు వారాలు హౌజ్ ను అల్లాడించింది. వచ్చిన మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లతో గొడవలు, ఆర్గుమెంట్స్ రచ్చ రచ్చ చేసింది. తప్పు, ఒప్పు అనేది పక్కన పెడితే ప్రతీ విషయంలో తన అభిప్రాయాలను బోల్డ్ గా చెబుతూ ఫైర్ బ్రాండ్ అనిపించుకుంది. అటు రాజకీయంగా, ఇటు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న మాధురి కాస్త ఎక్కువ కాలమే ఉంటుందని అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా మూడు వారాలకే ఎలిమినేటై బయటకు వచ్చేసింది. నామినేషన్స్ లోకి వచ్చిన మొదటిసారే మాధురి ఎలిమినేట్ అవ్వడం అందరినీ కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది. 

Also Read :  చేవెళ్ల విషాదం.. నాగచైతన్య, మీనాక్షి చౌదరి మూవీ ఫస్ట్ లుక్ వాయిదా

శివాజీ బజ్ 

ఎలిమినేషన్ తర్వాత శివాజీ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. కంటెస్టెంట్లు హౌజ్ చేసిన తప్పులన్నింటికీ ఇక్కడ లెక్క చెప్పాల్సి ఉంటుంది. అయితే నిన్న హోస్ట్ శివాజీ, మాధురి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కాస్త వాడివేడిగానే జరిగింది. హోస్ట్ శివాజీ తన ప్రశ్నలతో మాధురికి చుక్కలు చూపించారు. ఇక మాధురి కూడా ఎక్కడ తగ్గలేదు.. శివాజీ ప్రశ్నలకు తనదైన స్టైల్లో కౌంటర్లు విసిరింది. ఈ బజ్ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియో ఇక్కడ చూడండి. 

Also Read: Allu Sirish: ఆ స్టార్ హీరో పార్టీలో మొదలైన శిరీష్- నయనిక లవ్ స్టోరీ!

Advertisment
తాజా కథనాలు