Vishwambhara: విశ్వంభర నుంచి ఈరోజు బిగ్ అప్డేట్..ట్వీట్ చేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవి..వంశీ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా విశ్వంభర. సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతున్న దీనిపై ఈరోజు బిగ్ అప్డేట్ రానుందని తెలుస్తోంది. స్పెషల్ పోస్టర్ తో పాటూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని సమాచారం.

New Update
Director Vasishta reacy on copying Avatar film and making Vishwambhara movie

Vishwambara teaser trolled by netizens director Vasishta react

మెగాస్టార్ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు చేస్తున్నారు. వీటిలో వంశీ డైరెక్షన్ లో చేస్తున్న విశ్వంభర సోషియా ఫాంటసీ ముందుగా విడుదల అవనుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం విశ్వంభర పాటలను విడుదల చేశారు. దాని తరువాత ఏ అప్డేట్ లేదు. ఇప్పడు తాజాగా ఈరోజు మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. రేపు మెగాస్టార్ బర్త్ డే కావడంతో ఒకరోజు ముందుగానే ఫాన్స్ కు టీట్ర్ ఇవ్వనున్నారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన స్వయంగా చిరునే ఎక్స్ లో పోస్ట్ చేశారు కూడా. 

స్పెషల్ పోస్టర్, రిలీజ్ డేట్...

 చిరంజీవి చెప్పినదాన్ని బట్టి ఫ్రెష్ స్పెషల్ పోస్టర్ తో పాటూ రిలీజ్ డేట్ ను కూడా కన్ఫార్మ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. విశ్వంభర మూవీని సెప్టెంబర్ లో విడుదల చేస్తారని అనుకున్నారు అందరూ. కానీ వచ్చే నెలలో బోలెడు సినిమాల రిలీజ్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాతో పాటూ బాలయ్య బాబు అఖండ 2 కూడా రిలీజ్ ఉంది. వీటితో పాటూ మరి కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందుకే విశ్వంభర విడుదల తేదీని వాయిదా వేశారని..అక్టోబర్ లేదా నవంబర్ లో దీన్ని రిలీజ్ చేస్తారని అంటున్నారు. 

సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న విశంభర సినిమా  యువీ క్రియేషన్స్  భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో వీఎఫెక్స్ ప్రధాన ఆకర్షణగా నిల్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే విడుదలైన టీజర్ లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని విమర్శలు రావడంతో.. నిర్మాతలు వీఎఫెక్స్ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నారు. ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ స్థాయి నిపుణులతో కలిసి పనిచేస్తున్నారు.  దీని కారణంగానే విడుదల కూడా ఆలస్యమవుతూ వస్తుందని టాక్. 

ఈ సినిమాలో  మెగాస్టార్ సరసన  త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. దాదాపు 18 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ  చిరంజీవి, త్రిష  కలిసి స్క్రీన్ పై  కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది  సంక్రాంతికి  'విశ్వంభర' ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Also Read: AP: పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఊరుకునేది లేదు..ఎమ్మెల్యే బుడ్డాకు సీఎం చంద్రబాబు వార్నింగ్

Advertisment
తాజా కథనాలు